
భారతదేశంలో ప్రీమియం కార్ల ప్రియులు వోక్స్వ్యాగన్కు సంబంధించిన టాప్-లైన్ ప్రీమియం ఎస్యూవీ వోక్స్వాగన్కు టిగువాన్ అప్డేట్ వెర్షన్ కోసం చాలా రోజులుగా వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వోక్స్వ్యాగన్ కంపెనీ తన అప్డేటెడ్ వెర్షన్ వోక్స్వ్యాగన్ టిగువాన్ ఆర్-లైన్ను విడుదల చేసింది. రూ.49 లక్షల ప్రారంభ ధరతో రిలీజ్ చేసిన ఈ కారు దూరప్రయణాల్లో ఎలాంటి అనుభూతినిస్తుందనే విషయాన్ని ఓ ప్రత్యేక వీడియో ద్వారా చూద్దాం..
వీడియో చూడండి..
ఉదయపూర్ నుంచి జైపూర్ వరకు 400 కిలోమీటర్లకు పైగా ప్రయాణంలో టీవీ9 బృందం వోక్స్వ్యాగన్ టిగువాన్ ఆర్-లైన్ను ఎంచుకుంది. ఈ కారులోని క్లైమేట్ కంట్రోల్ ఫీచర్ 42-43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత మధ్య కారు లోపల సౌకర్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా కారులో ఉన్న ఏడీఎస్, మల్టీ డ్రైవ్ మోడ్ కారణంగా గంటకు 100 కి.మీ వేగంతో ఈజీగా దూసుకుపోవచ్చు.
వోక్స్వ్యాగన్ టిగువాన్ ఆర్-లైన్ ఎస్యూవీ 2 లీటర్ ఇంజిన్తో వస్తుంది. అలాగే ఈ కారు 204 హెచ్పీ, 320 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మీరు కారు యాక్సిలరేటర్ నొక్కిన వెంటనే లీనియర్ పవర్ పొందిన వెంటనే పికప్ మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ కారుకు సంబంధించిన పూర్తి రివ్యూ ఈ కింది వీడియోలో చూసేయండి..