
దీన్ని మితిమీరిన మోజు అనాలా..? అతి కండకావరం అనాలో మీరే చెప్పండి. ప్రియుడు తనతో క్లోజ్‌గా ఉండటం లేదని.. ఓ మహిళ తిక్క పనికి పూనుకుంది. ఆమె చేసిన పనితో ఏకంగా రూ. 19 లక్షల మేర ఆస్తినష్టం వాటిల్లింది. ఇంతకీ ఏం జరిగింది అంటారా..?. ఓ మహిళ ప్రియుడు తనతో సఖ్యతగా ఉండటం లేదని.. అతను ఇటీవల కొన్న కాస్ట్లీ బైక్‌ను నిప్పు పెట్టింది. దీంతో అతని బైక్ పక్కనున్న మరో 18 వాహనాలు కూడా మంటలు అంటుకుని కాలిపోయాయి. తొలుత అందరూ ఫైర్ యాక్సిడెంట్ ఏమో అనుకున్నారు. కానీ దగ్గర్లోని సీసీ ఫుటేజ్ చేయగా మేడమ్ గారి బాగోతం బయటపడింది.
జీవీఎంసీ (GVMC)లో వర్క్ చేస్తోన్న ఓ పెళ్లైన వ్యక్తికి బర్మా క్యాంపు ప్రాంతానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం ఉందని పోలీసుల ఎంక్వైరీలో తేలింది. ఆమె తనను పట్టించుకోవటం లేదన్న కోపంతో.. సింగ్ హోటల్ జంక్షన్ సమీపంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అతని అపార్ట్మెంట్ సెల్లార్‌కి వెళ్లి ప్రియుడి బైక్‌కి నిప్పు పెట్టింది. దీంతో ఆ బైక్ పక్కన పార్క్ చేసిన వాహనాలు కూడా దగ్దమయ్యాయి. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కోర్టులో ప్రవేశపెట్టగా.. న్యాయమూర్తి రిమాండ్ విధించారు. నిందితురాలిని కలిగోట్ల కనకేశ్వరి అలియాస్ కరుణ (37)గా గుర్తించారు.
కొంతకాలంగా ప్రియుడు తనతో సన్నిహితంగా మెలగడం లేదని, అతను ఇటీవలే కొనుగోలు చేసిన బైక్‌ను తగలబెట్టిందని ఏసీపీ లక్ష్మణ మూర్తి తెలిపారు. క్రమంగా ఆ మంట సెల్లార్లో పార్క్ చేసిన మిగిలిన బైక్‌లకు వ్యాపించడంతో మొత్తం 18 బైక్స్ దగ్గమైనట్లు వివరించారు. ఫస్ట్ ఫ్లోర్‌కు కూడా మంటల సెగ వ్యాపించడం వల్ల ఆస్తి నష్టం పెరిగిందన్నారు. ఈ ఘటనపై ఆ యువతిని విచారించగా తొలుత తనకేమీ తెలీదని చెప్పింది.. తర్వాత సమీప ప్రాంతాల్లోని సీసీ కెమెరా ఫుటేజీలు చెక్ చేయగా ఆమే ఈ పని చేసినట్లు తేలిందని ఏసీపీ వివరించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.