
మన దేశంలో బడ్జెట్లో లెవెల్లో స్మార్ట్ ఫోన్లకు మంచి డిమాండ్ ఉంటుంది. అందుకే కంపెనీలు మిడ్ రేంజ్ ధరల్లో తమ ఉత్పత్తులను లాంచ్ చేస్తూ ఉంటాయి. ఇదే క్రమంలో రూ. 15,000 లోపు ధరలో రియల్ మీ, వివో కంపెనీలు కొత్త స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేశాయి. అవి వివో టీ4ఎక్స్, రియల్ మీ పీ3. వివో టీ4ఎక్స్ లో శక్తివంతమైన మీడియా టెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్, 6500ఎంఏహెచ్ బ్యాటరీ, రియల్ మీ పీ3 ఫోన్లో అమోల్డ్ డిస్ ప్లే తోపాటు మంచి వాటర్ రిసిస్టెన్స్ తో వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు ఫోన్లలో మనం ఏది కొనాలి? తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.. రియల్ మీ పీ3, వివో టీ4ఎక్స్ ఫోన్ల స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు, వాటి మధ్య తేడాలు ఇప్పుడు చూద్దాం..
వివో టీ4ఎక్స్ స్పెసిఫికేషన్లు..
వివో టీ4ఎక్స్.. ఇది 5జీ ఫోన్. దీనిలో 120హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.72-అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ ఎల్సీడీ డిస్ప్లేను కలిగి ఉంది. ఈ డిస్ప్లే 1050 నిట్స్ గరిష్ట ప్రకాశాన్ని అందిస్తుంది. కంటి రక్షణ కోసం టీయూవీ రీన్‌ల్యాండ్-సర్టిఫికేషన్‌తో వస్తుంది. ఈ ఫోన్ లో మీడియా టెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ ఉంటుంది. 8జీబీ ర్యామ్ ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఫన్‌టచ్ ఓఎస్ 15పై నడుస్తుంది. లైవ్ టెక్స్ట్, సర్కిల్ టు సెర్చ్ ఏఐ స్క్రీన్ ట్రాన్స్లేషన్ వంటి ఏఐ-ఆధారిత ఫీచర్లను అందిస్తుంది. దీనిలో 50ఎంపీ ప్రైమరీ షూటర్, 2ఎంపీ డెప్త్ సెన్సార్‌తో వస్తుంది. ముందు భాగంలో, 8ఎంపీ సెల్ఫీ షూటర్ ఉంటుంది. దీనిలో 6500ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది ఎక్కువ వినియోగ సమయాన్ని హామీ ఇస్తుంది. అదనంగా, ఇది 44వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. మన్నిక విషయంలోనూ కంపెనీ భరోసా ఇస్తుంది. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్‌ను ఈ ఫోన్ కలిగి ఉంది. ఐపీ64 రేటింగ్‌తో నీరు, ధూళికి నిరోధకతను కలిగి ఉంటుంది.
రియల్మీ పీ3 స్పెసిఫికేషన్లు..
రియల్ మీ పీ3.. ఇది కూడా 5జీ ఫోనే. దీనిలో 120హెర్జ్ రిఫ్రెష్ రేట్, 2,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, ప్రో ఎక్స్ డీఆర్ సపోర్ట్‌తో 6.67-అంగుళాల అమోల్డ్ డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇది స్నాప్ డ్రాగన్ 6 జెన్ 4 ప్రాసెసర్ తో శక్తిని పొందుతుంది. 8జీబీ వరకు ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందిస్తుంది. ఇది తాజా ఆండ్రాయిడ్ 15 ఆధారంగా రియల్ మీ యూఐ 6.0 ఆధారంగా పనిచేస్తుంది. 2 సంవత్సరాల వరకూ ఓఎస్ అప్ డేట్లు, మూడేళ్ల వరకూ సెక్యూరిటీ ప్యాచ్ లను అందిస్తుంది. ఇక
ఆప్టిక్స్ విషయానికొస్తే, ఫోన్లో 50ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 2ఎంపీ డెప్త్ సెన్సార్ ఉంది. రెండు మోడళ్లలో హై-రిజల్యూషన్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. అంతేకాక 45వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 6,000ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది ఐపీ68, ఐపీ69 తో నీరు, ధూళి నిరోధకతను అందిస్తుంది.
ధరలు ఇలా..
- వివో టీ4ఎక్స్ ప్రారంభ ధర 6జీబీ ర్యామ్/128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 13,999, టాప్ ఎండ్ 8జీబీ ర్యామ్/256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 14,999 వరకు ఉంటుంది.
- రియల్ మీ పీ3 ప్రారంభ వేరియంట్ 6జీబీ ర్యామ్/128జీబీ స్టోరేజ్ ధర రూ. 16,999, టాప్ ఎండ్ వేరియంట్ 8జీబీ ర్యామ్/128జీబీ స్టోరేజ్ ధరరూ. 17,999గా ఉంది.
ఏది బెస్ట్?
ఫీచర్లు, స్పెసిఫికేషన్లను పరిశీలిస్తే రియల్ మీ పీ3 లో అమోల్డ్ డిస్ ప్లే, ఐపీ69వాటర్ రెసిస్టెన్స్, అదిక రిజల్యూషన్ తో కూడిన 16ఎంపీ కెమెరాతో ముందంజలో ఉంది. అదే సమయంలో వివో టీ4ఎక్స్ కూడా ఏమాత్రం తగ్గదు. దీనిలో డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ సాయంతో 6500ఎంఏహెచ్ బ్యాటరీ, మిలటరీ సర్టిఫికేషన్‌తో వస్తుంది. మీరు రూ. 15,000లోపు బడ్జెట్లో ఈ రెండింటిలో ఏది కొనాలి అని ఆలోచన చేస్తే.. అధిక బ్యాటరీ సామర్థ్యం, శక్తివంతమైన ప్రాసెసర్ కావాలంటే వివో టీ4ఎక్స్ బెస్ట్ ఆప్షన్. కానీ అమోల్డ్ డిస్ ప్లే, వాటర్ రెసిస్టెంట్ కావాలంటే మాత్రం రియల్ మీ పీ3 మంచి ఎంపిక.