
Arshad Khan out Virat Kohli With His Magic Ball: ఐపీఎల్ 2025లో భాగంగా 14వ మ్యాచ్‌లో ఆర్సీబీతో తలపడుతోన్న గుజరాత్ జట్టు.. అద్భుతంగా రాణిస్తోంది. పవర్ ప్లేలోపే వరుసగా రెండు కీలక వికెట్లు పడగొట్టి ఆర్సీబీ హోం గ్రౌండ్లో బెంగళూరు జట్టుకు బిగ్ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా అర్షద్ ఖాన్ విరాట్ కోహ్లీని ఔట్ చేసిన తర్వాత ఈ హై-వోల్టేజ్ పోరు మరింత హీటెక్కింది. ఆ తర్వాత దేవదత్ పడిక్కల్‌ను మహమ్మద్ సిరాజ్ బౌల్డ్ చేశాడు.
విరాట్ కోహ్లీని ట్రాప్ చేసిన అర్షద్ ఖాన్..
ఈ మ్యాచ్‌లో లెజెండరీ బ్యాటర్ విరాట్ కోహ్లీని అవుట్ చేసిన అర్షద్ ఖాన్ గుజరాత్‌కు ఊహించని ఆరంభం అందించాడు. కగిసో రబాడ స్థానంలో వచ్చిన ఈ ఫాస్ట్ బౌలర్.. షార్ట్ బాల్‌తో కోహ్లీని ట్రాప్ చేశాడు. దీంతో బెంగళూరు ఫ్యాన్స్ షాకయ్యారు. హోం గ్రౌండ్లో భారీ ఇన్నింగ్స్ ఆడతాడనుకున్న కోహ్లీ.. ఇలా తక్కువ స్కోర్‌కు పెవిలియన్ చేరడం ఫ్యాన్స్‌కు ఏమాత్రం నచ్చలేదు.
ఆ తర్వాత మొహమ్మద్ సిరాజ్ తన మొదటి ఓవర్లో ఆరు పరుగులు ఇచ్చిన తర్వాత.. గుజరాత్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ మరొక ఎండ్ నుంచి అర్షద్ ఖాన్‌ను తీసుకువచ్చాడు. ఎడమచేతి వాటం పేసర్ తన లెంగ్త్‌లను అనూహ్యాంగా మార్చుకున్నాడు. చివరికి తన మొదటి ఓవర్లోనే కోహ్లీని ట్రాప్ చేసిన పెవిలియన్ చేర్చాడు.
అర్షద్ ఖాన్ తన ఓవర్‌ను ఫుల్-లెంగ్త్ డెలివరీతో ప్రారంభించాడు. ఈ బంతికి కోహ్లీ రెండు పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత అర్షద్ తన లెంగ్త్‌ను కొంచెం తగ్గించి, ఇన్-స్వింగింగ్ యార్కర్‌తో కోహ్లీకి బిగ్ షాకిచ్చాడు.
కోహ్లీ అప్పటికే తన ఫ్రంట్ ఫుట్‌తో ఆడుతున్నాడు. ఈ క్రమంలో అర్షద్ ఒక పదునైన షార్ట్ బాల్‌తో కోహ్లీని ఆశ్చర్యపరిచాడు. డీప్ మిడ్-వికెట్ బౌండరీ వద్ద ఫీల్డర్‌ను ఉంచాడు. ఫీల్డ్ ప్రకారం బౌలింగ్ చేశాడు. దీంతో చివరకు కోహ్లీ ట్రాప్‌లో చిక్కుకుని వికెట్ సమర్పించుకున్నాడు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..