రైల్వేస్టేషన్లలో ఊహించని ప్రమాదాలు ఎదురవుతుంటాయి. రైలు రన్నింగ్‌లో ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు కిందపడిపోతుంటారు. అలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అలాంటి వీడియోనే తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఇక్కడ ఓ మనిషి నిర్లక్ష్యం కారణంగా కుక్క ప్రాణాల మీదకు వచ్చింది.
ఓ రైల్వే స్టేషన్లో రాజధాని ఎక్స్‌ప్రెస్ కదులుతుండగా ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కను నిర్లక్ష్యంగా ఈడ్చుకెళ్లి రైలు ఎక్కించబోతాడు. అయితే రైలు వేగం పెరగడంతో ఆ కుక్క రైలు ఎక్కలేకపోతుంది. కుక్క యజమాని బలవంతంగా దాని పట్టీని లాగి ప్లాట్‌ఫారమ్ వెంట లాగుతాడు. దీంతో అక్కడ విషాద సంఘటన చోటుచేసుకుంది. కుక్కకు కట్టిన బెల్ట్ ఊడిపోవడంతో ఆ మూగజీవి రైలు, ప్లాట్‌ఫారమ్ మధ్య గ్యాప్‌లోకి పడిపోతుంది. ఆ హృదయ విదారక దృశ్యాలు నెటిజన్స్‌ను కలిచి వేస్తున్నాయి.
రైలు కదులుతూనే ఉండగా, ఆ వ్యక్తి తన పెంపుడు కుక్క కోసం తీవ్రంగా వెతికాడు. సంఘటన భయంకరంగా ఉంది. అయితే ఆ కుక్క ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ సంఘటనను జంతు ప్రేమికులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ ప్రమాదానికి యజమానిని బాధ్యునిగా పేర్కొంటూ కామెంట్ల రూపంలో దుమ్మెత్తిపోస్తున్నారు. కుక్క పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన యజమానిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
వీడియో చూడండి:
When money can’t buy wisdom! pic.twitter.com/suADun73fu
— Trains of India (@trainwalebhaiya) April 1, 2025
దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్స్:
“ఓరి దేవుడా. ఆ పెంపుడు జంతువు బ్రతికిందా? వాళ్ళు ఎలాంటి మనుషులు?” “ఈ వీడియో చూసిన తర్వాత నాకు చాలా బాధగా ఉంది. కుక్క బతికి ఉందని నేను ఆశిస్తున్నాను.” “మీరు బాధ్యతతాయుతంగా లేకుంటే పెంపుడు జంతువును పెంచుకోకండి. ఇది హృదయ విదారకం.” “ఈ వీడియో చూసిన తర్వాత నాకు చాలా బాధగా ఉంది. కుక్క బతికి ఉందని నేను ఆశిస్తున్నాను.” “90% పెంపుడు జంతువుల యజమానులు పెంపుడు జంతువులను పిల్లలతో తీసుకెళ్లినట్లుగానే ఎందుకు తీసుకెళ్లకూడదు? మీరు నిజంగా అలా పరిగెత్తి రైలును పట్టుకోవాల్సి వస్తే.” “ఈ నెలలో నేను చూసిన అత్యంత బాధించే వీడియో ఇది” అంటూ సోషల్ మీడియా వినియోగదారులు పోస్టుల రూపంలో తమ బాధను వ్యక్తపరుస్తున్నారు.
