
మన చుట్టూ జరిగే కొన్ని సంఘటనలు ఆశ్చర్యకరంగానూ, నవ్వు తెప్పిచేవీగాను ఉంటాయి. అచ్చం సినిమాల్లో మాదిరిగానే ఇక్కడో హాస్య సన్నివేశం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఒక డెలివరీ మ్యాన్ అనుకోకుండా తన వ్యాన్‌ను పార్క్ చేయడం మర్చిపోవడంతో దానికదే వెళ్లి రెండు వాహనాలను ఢీకొట్టింది. వీడియో వైరల్ కావడంతో నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.
డెలివరీ మాన్ పార్శిల్‌ను అందించడానికి ఒక ఇంటికి చేరకుంటాడు. తదుపరి డెలివరీని సమయానికి అదించడానికి అతను తొందరలో ఉన్నట్లుకన్నాడు. అయితే, అతను తొందరలో డెలివరీ వ్యాన్‌ను సురక్షితంగా పార్క్ చేయడం మర్చిపోతాడు. కొన్ని క్షణాల తర్వాత వ్యాన్ నెమ్మదిగా వెనక్కి వస్తుంది. చిన్న వచ్చి పెద్ద నష్టం కలిగించింది ఆ వ్యాన్. నేరుగా ఇంటి యజమానికి చెందిన పార్క్ చేసిన కారును ఢీకొట్టింది. ఇంటి తలుపు కూడా దెబ్బతింది. దీంతో ఆ ఇంటి యజమాని మహిళ బయటికి వచ్చి ఊహించని ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయింది. అయితే ఆ వ్యాన్ మరింత వెనకకు రాకుండా డెలివరీ మ్యాన్ దాన్ని అడ్డుకుంటాడు.
అసలు హాస్య సన్నివేశం ఇక్కడే జరిగింది. అంతా బాగుందని డెలివరీ మ్యాన్ రిలాక్స్ అవుతున్న సమయంలో వ్యాన్ ట్విస్ట్ ఇచ్చింది. వ్యాన్ ఇప్పుడు దానంత అదే ముందుకు దూసుకెళ్లి ఎదురింటిలో పార్క్ చేసిన కారును ఢీకొట్టింది. దురదృష్టవంతుడైన డెలివరీ మ్యాన్ ఇప్పుడే ఏమి జరిగిందో గ్రహించి భయంతో వెనక్కి తిరిగి కనిపించాడు.
ఈ డబుల్ బ్లండర్ సోషల్ మీడియా యూజర్స్‌ను తెగ ఆకట్టుకుంటుంది. నెటిజన్స్ రకరకాలుగా ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.
వీడియో చూడండి:
There’s no recovering from this pic.twitter.com/4xCIjRsvJm
— Crazy Clips (@crazyclipsonly) April 3, 2025