
ఉత్తర ప్రదేశ్లో ఇటీవల భార్య భర్తల మధ్య అనూహ్య సంఘటనలు జరుగుతున్నాయి. భార్యకు ప్రియుడితో పెళ్లి జరిపించడం వంటి సంఘటనలు ఆ రాష్ట్రంలో ఇటీవల వరుసగా జరుగుతున్నాయి. అలాంటి సంఘటనే మరొకటి జరిగింది. ఓ మహిళకు అప్పటికే పెళ్లి అయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఎంతో అన్యోన్యంగా సాగాల్సిన వారి కాపురం ఒక్కసారిగా కుదుపుకు గురయింది. భర్త సర్వస్వంగా బతకాల్సిన ఆ మహిళ మరో వ్యక్తితో ప్రేమలో పడింది. గుట్టుగా ఇంట్లోనే ఉంటూ కథ నడిపిస్తోంది. అయితే ఆలస్యంగా విషయం తెలుసుకున్న భర్త.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి చేసేశాడు.
ఉత్తరప్రదేశ్లోని ఫరూఖాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఆశ్చర్యకరమైన సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పప్పు అనే వ్యక్తి తన భార్యను ఆమె కంటే చాలా చిన్న వయసున్న ప్రేమికుడితో వివాహం జరిపించాడు. ఈ అసాధారణ సంఘటన కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా ఆర్థికంగా బలహీన వర్గాలలో పెరుగుతున్న ధోరణిని చాటి చెబుతోంది.
పప్పు భార్య స్థానిక యువకుడితో ప్రేమలో పడింది. ఆమె కన్నా అతను చాలా చిన్నవాడు, పైగా నిరుద్యోగి. ఇద్దరు పిల్లల తల్లి అయిన ఆ మహిళ చాలా కాలంగా తన ప్రేమికుడిని రహస్యంగా కలుస్తోంది. ఈ వ్యవహారం భర్తకు తెలిసింది. సమాజం నుండి నిరంతరం నిందలను ఎదర్కొన్నాడు. భార్యకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించాడు. చివరికి విసిగిపోయిన పప్పు వారికి వివాహం జరిపించాలని నిర్ణయించుకున్నాడు.
చివరికి భార్యకు ఆమె ప్రియుడికి భర్తే దగ్గరుండి వివాహం జరిపించాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.
వీడియో చూడండి: