
మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో వీధికుక్కలు ఓ చిన్నారి పుర్రెతో ఆడుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది నేతాజీ సుభాష్ చంద్రబోస్ మెడికల్ హాస్పిటల్ హాస్టల్ దగ్గర చిత్రీకరించినదిగా గుర్తించారు. ఈ ఘటనపై మెడికల్ కాలేజీ డీన్ నవనీత్ సక్సేనా విచారణకు ఆదేశించారు. పుర్రె అక్కడికి ఎలా వచ్చిందని.? అది ఎవరిదని.? హాస్టల్ వెనుక ఉన్న చెరువు దగ్గర పడేసింది ఎవరని.? తెలుసుకోనున్నారు.
ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. రెండు కుక్కపిల్లలు ఈ చిన్నారి పుర్రెతో ఆడుకుంటున్న దృశ్యాలు మీరు చూడవచ్చు. ఆ పుర్రెను ఓ వీధికుక్క ఎత్తుకుపోతున్నట్టు అందులో ఉంది. కాగా, ఆసుపత్రి సిబ్బంది చిన్నారి పుర్రెను హాస్టల్ వెనుక పూడ్చిపెట్టారని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ వీడియో ఈ లింక్ లో చూడండి..
ఇవి కూడా చదవండి
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి