
ప్రస్తుతం పాములకు మేటింగ్ సీజన్. అందుకే ఎక్కడ చూసినా అవి సయ్యాటలు ఆడుతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయ్. అయితే ఇది సమ్మర్ సీజన్ అని కూడా గుర్తుపెట్టుకోవాలి. అవి ఆవాసాలను కోల్పోయి.. వేడి తాపానికి తట్టుకోలేక జనావాసాల్లోకి వచ్చే అవకాశం ఉంది. అలక్ష్యంగా ఉంటే ప్రమాదాల్లో పడాల్సి వస్తుంది. పాములు వాహనాల్లో, ఇళ్లలో తలుపుల వెంట, బూట్లలో, బ్యాగుల్లో నక్కడం ఇప్పటివరకు చూసి ఉంటారు. కానీ ఎలా చేరిందో ఏమో తెలియదు కానీ ఓ పాము ఏకంగా ఫ్రిజ్ లోపల తిష్ట వేసింది. డోర్ తీయగానే పడగ విప్పి కనిపించడంతో గుండె ఆగినంత పనయింది.
ప్రస్తుతం పీక్ సమ్మర్ కారణంగా అందరూ వేడి, ఉక్కపోతకు అల్లాడిపోతున్నారు. వేడి నుంచి రిలీఫ్ కోసం చల్లిని నీటిని తాగుతున్నారు. అలానే ఓ మహిళ తన ఇంటిని ఫ్రిజ్‌లోని చల్లటి నీరు తాగాలని ఆరాటపడింది. అయితే రిఫ్రిజిరేటర్ డోర్ తెరవగానే నాగరాజా కనిపించడంతో కంగుతింది. వెంటనే ఆ ఫ్రిజ్‌కు దూరంగా జరిగి.. ఆ పామును వీడియో తీసింది. అయితే పాము ఫ్రిజ్‌లోకి ఎలా వెళ్లింది అనే అంశంపై వివరాలు వెల్లడించలేదు. సోషల్ మీడియాలో ఈ వీడియోకు ఓ రేంజ్లో షేర్లు, కామెంట్స్ వస్తున్నాయి. ‘వామ్మో, ఇకపై మనం ఇంట్లో కూడా జాగ్రత్తగా ఉండాలని’ ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు. ‘ఏ తప్పేముంది బయట వేడిగా ఉంది. కాస్త చల్లదనం కోసం ఫ్రిజ్‌లోకి వెళ్లింది’ అని మరో యూజర్ ఫన్నీగా కామెంట్ పెట్టాడు. అయితే ఈ వీడియోను పామును ఫ్రిజ్ లోపల ఉంది.. కావాలని వీడియో తీశారని మరికొందరు చెబుతున్నారు.
NOTE: ఈ వీడియో సోషల్ మీడియా నుంచి సేకరించబడింది. ప్రామాణికతను టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు..