

వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ దాదాపు 17 ఏళ్లు కడుపు నొప్పి భరించాల్సి వచ్చింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జరిగింది. లక్నోకు చెందిన సంధ్యా పాండే అనే మహిళ పురిటి నొప్పులతో 2008, ఫిబ్రవరి 28న ‘షీ మెడికల్ కేర్’ నర్సింగ్ హోమ్‌లో చేరారు. అక్కడి వైద్యులు ఆమెకు సి-సెక్షన్ ఆపరేషన్ చేయగా.. ఆ సమయంలో కత్తెరను ఆమె కడుపులోకి మర్చిపోయారు. ఇక అప్పటినుంచి ఇన్నేళ్లుగా సదరు మహిళ నిరంతర కడుపునొప్పితో బాధపడుతూనే ఉంది.
ఇది చదవండి: దేవుడు కలలో కనిపించి పొలంలో తవ్వమన్నాడు.. తీరా తవ్వి చూడగా
సంవత్సరాలు గడుస్తున్న ఆమె కడుపునొప్పి పెరుగుతూనే ఉంది తప్పితే.. ఏం తగ్గట్లేదు. ఇలా కాదని.. ఇటీవల స్థానిక కేజీఎంయూ ఆస్పత్రికి వెళ్లి స్కాన్ చేయగా.. అసలు విషయం బయటపడింది. సాధారణ వైద్య పరీక్షలలో భాగంగా నిర్వహించిన ఎక్స్-రేలో ఆమె పొత్తికడుపులో కత్తెర ఉన్నట్లు గుర్తించారు డాక్టర్లు. కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్శిటీ(KGMU) వైద్యులు సదరు మహిళకు మార్చి 26న ఆపరేషన్ నిర్వహించి.. కత్తెరను విజయవంతంగా బయటకు తీశారు. ఆపరేషన్ నిర్వహించిన వైద్యులు మాట్లాడుతూ.. ‘ఆపరేషన్ సవాల్‌తో కూడుకున్నప్పటికీ, చివరికి మహిళ కడుపులో నుంచి కత్తెరను విజయవంతంగా తొలగించాం. రెండు రోజులు అబ్సర్వేషన్లో ఉంచి.. ఆ మహిళను డిశ్చార్జ్ చేశామని’ అన్నారు. ప్రస్తుతం మహిళ ఆరోగ్యం కుదుటపడిందని చెప్పారు.
కాగా, ఈ ఘటనపై సంధ్యా పాండే భర్త అరవింద్ కుమార్ పాండే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్యకు 17 ఏళ్ల క్రితం సిజేరియన్ చేసింది డాక్టర్ పుష్ప జైస్వాల్ అని.. దీనికి ఆమె పూర్తి బాధ్యత వహించాలని.. అలాగే ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు జరపాలని పోలీసులను కోరాడు.
ఇది చదవండి: కూకట్పల్లి మెట్రో స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు.. ఆపి చెక్ చేయగా