

ఆశ మనిషిని బ్రతికిస్తే.. అత్యాశ మనిషిని ఎంతకైనా తెగించేలా చేస్తుంది. ఈ సామెత ఇప్పుడెందుకు చెబుతున్నారని చూస్తున్నారా.! సంతృప్తి కోసం వ్యక్తి ఎంతకైనా తెగిస్తాడు. ఇక చివరికి సమస్యలు ఏరికోరి కొనితెచ్చుకుంటారు. సరిగ్గా ఇలాంటి ఘటన ఒకటి దక్షిణ అమెరికాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఓ వృద్దుడి పురీషనాళంలో ఒక పెద్ద కూరగాయ ఉండటాన్ని ఎక్స్‌రేలో గుర్తించారు వైద్యులు. ముల్లంగి లాంటి దుంప ఆ 72 ఏళ్ల వ్యక్తి శరీరంలో ఉండటాన్ని చూసి దెబ్బకు కంగుతిన్నారు డాక్టర్లు. దీంతో వైద్యులు వెంటనే అత్యవసర చికిత్స అందించి.. దాన్ని తొలగించారు.
సదరు వ్యక్తి పురీషనాళంలో ఆ కూరగాయ లోతుగా చీలిపోయినట్టు డాక్టర్లకు ఎక్స్‌రేలో కనిపించింది. అయితే అది ఎలా తన శరీరంలోకి వెళ్లిందో అతడు చెప్పగా.. ఆ ఇన్సిడెంట్‌కు షాక్ తిన్నారు వైద్యులు. ఆ వ్యక్తి ప్రకారం, తన భాగస్వామితో ఇంటిమేట్ మూమెంట్లో ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింది. వెంటనే సదరు వ్యక్తిని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడి డాక్టర్లు అత్యవసర చికిత్స అందించి.. ఆ కూరగాయను తొలగించారు.
ఆపరేషన్ విజయవంతమైందని.. ఆ కూరగాయను అతడి శరీరం నుంచి బయటకు తీశామని డాక్టర్లు చెప్పారు. సదరు వ్యక్తికి ఎలాంటి దుష్ప్రభావాలు కలగలేదని.. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాడని డాక్టర్లు చెప్పారు. కాగా, ఆ ఆస్పత్రిలోని వైద్యులు ఈ రేర్ కేసు గురించి మాట్లాడుతూ.. గతంలో సీసాలు, ఫ్లాష్లైట్లు, అరటిపండ్లు వంటి వస్తువులను సైతం మనిషి శరీరం నుంచి తీసిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. కాగా, 72 ఏళ్ల వ్యక్తికి కొలంబియాలోని ఆస్పత్రిలో చికిత్స అందించగా.. ఇలాంటి పనులు అస్సలు చేయవద్దని వైద్యులు సూచించారు.