
ఫ్యామిలీతో కలిసి ట్రిప్‌కి వెళ్లిన మూడేళ్ల పాప రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయిపోయింది. అందుకు కారణం.. తను అక్కడ అత్యంత అరుదైన పురాతన వస్తువును కనుగొనడమే. దీంతో ఆ పాపపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన ఇజ్రాయెల్ దేశంలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్లితే.. దక్షిణ ఇజ్రాయెల్… తెల్ అజెకా అనే చారిత్రక ప్రాంత సందర్శనకు జివ్ నిట్జాన్ అనే మూడేళ్ల ఫ్యామిలీతో కలిసి వెళ్లింది. అక్కడ తను ఆడకుంటుండగా ఓ రాయి ప్రత్యేకంగా అనిపించండంతో.. దాన్ని తీసకువచ్చి… తల్లిదండ్రులకు చూపించింది. వారు దాన్ని పురాతన వస్తువుగా గుర్తించి, ఇజ్రాయెల్ పురావస్తు అథారిటీకు అప్పగించారు.
పురావస్తు శాఖ వారు ఆ రాయిని పరిశీలించి, అది 3800 ఏళ్ల క్రితం నాటి ఈజిప్టియన్ సీల్డ్ ముద్రగా గుర్తించారు. అనంతరం చారిత్రక నేపథ్యం ఉన్న అరుదైన వస్తువును బాధ్యతగా ప్రభుత్వానికి అందించినందుకు జివ్ నిట్జాన్కు పురావస్తు శాఖ తరపున ప్రశంసా పత్రం ఇచ్చారు. ఈ వస్తువును ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీ ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శనలో పెట్టనున్నట్లు పురావస్తు శాఖ తెలిపింది. ఇక ఈ సీల్డ్ ముద్ర ఈజిప్ట్-కనాన్ సంబంధాలను తెలియజేస్తుందని, ఈజిప్ట్‌లో తయారైన ఈ వస్తువు పవిత్ర బీటిల్ చిహ్నంగా ఉందని పురావస్తు నిపుణురాలు డాఫ్నా బెన్-టోర్ చెప్పారు. మత విశ్వాసాలను ప్రతిబింబిస్తుందన్నారు.
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి.