
ప్రధాని మోదీ అమరావతి పర్యటన నేపధ్యంలో మే 2వ తేదీన ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు అమలులోకి రానున్నాయి. అమరావతిలో శంకుస్థాపన కోసం ప్రధాని మోదీ ఏపీకి రానున్నారు. ఆయన రోడ్డు షోతో పాటు బహిరంగ సభలోనూ పాల్గొననున్నారు. దీంతో అమరావతి చుట్టుప్రక్కల ట్రాఫిక్ మళ్లింపులు ప్రకటించింది ఏపీ ట్రాఫిక్ పోలీస్ శాఖ.
భారీ వాహనాలు, లారీల మళ్లింపులు:
ట్రాఫిక్ మళ్లింపులు (భారీ, ఇతర వాహనాలతో సహా) :
1. చెన్నై వైపు నుండి విశాఖపట్నంనకు వయా విజయవాడ మీదుగా ఇబ్రహీంపట్నం, నందిగామ, వైపుకు వెళ్ళు భారీ గూడ్స్ వాహనాలు ఒంగోలు జిల్లా త్రోవగుంట వద్ద నుండి చీరాల- బాపట్ల – రేపల్లె – అవనిగడ్డ- పామర్రు గుడివాడ హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖపట్నం. ఇబ్రహీంపట్నం వైపుకు మళ్ళించడం జరుగుతుంది. (అదే విదంగా విశాఖపట్నం నుండి చెన్నై వైపు వాహనాలు వెళ్లవలెను) ఇదే మార్గం గుండా
2. చిలకలూరిపేట వైపు నుండి విశాఖపట్నం వెళ్ళే వాహనాలను చిలకలూరి పేట నుండి NH-16 మీదుగా పెదనందిపాడు, కాకుమాను, పొన్నూరు, చందోలు, చెరుకుపల్లి, భట్టిప్రోలు, పెనుమూడి బ్రిడ్జ్ మీదుగా అవనిగడ్డ, పామర్రు గుడివాడ – హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖపట్నం వైపు మళ్లించబడును.
3. చెన్నై నుండి విశాఖపట్నం వెళ్ళే వాహనాలను బోయపాలెం క్రాస్ వద్ద నుండి ఉన్నవ గ్రామం, ఏ.బి.పాలెం, వల్లూరు, పాండ్రపాడు, పొన్నూరు, చందోలు, చెరుకుపల్లి, భట్టిప్రోలు, పెనుమూడి బ్రిడ్జ్ మీదుగా అవనిగడ్డ, పామర్రు -గుడివాడ-హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖపట్నం వైపు మళ్లించబడును.
4. గుంటూరు నుండి విశాఖపట్నం వైపు వెళ్ళే వాహనాలును బుడంపాడు క్రాస్ మీదుగా తెనాలి – వేమూరు- కొల్లూరు – వెల్లటూరు జంక్షన్ – పెనుముడి బ్రిడ్జ్ మీదుగా అవనిగడ్డ, పామర్రు – గుడివాడ – హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖపట్నం వైపు మళ్లించబడును.
5. గన్నవరం వైపు నుండి హైదరాబాద్ కు వయా ఆగిరిపల్లి – శోభనాపురం గణపవరం వెళ్ళవలెను. మైలవరం జి. కొండూరు ఇబ్రహీంపట్నం మీదుగా
6. విశాఖపట్నం నుండి హైదరాబాద్ వైపు: హనుమాన్ జంక్షన్ నుంచి నూజివీడు – మైలవరం జి. కొండూరు – ఇబ్రహీంపట్నం వైపు భారీ గూడ్స్ వాహనాలు వెళ్ళవలెను. ( అదే విదంగా హైదరాబాద్ నుండి విశాఖపట్నం వైపు ఇదే మార్గం గుండా వెళ్లవలెను)
మల్టీ-యాక్సిల్ గూడ్స్ వాహనాలకు ప్రత్యేక సూచనలు:
చెన్నై నుండి విశాఖపట్నం: ఈ వాహనాలు చిలకలూరిపేట, ఒంగోలు, నెల్లూరు వద్ద జాతీయ రహదారి దగ్గర మళ్లింపు లేకుండా నిలిపివేయబడతాయి.
విశాఖపట్నం నుండి చెన్నై: ఈ వాహనాలు హనుమాన్ జంక్షన్, పొట్టిపాడు టోల్ గేట్ వద్ద జాతీయ రహదారి దగ్గర ఆపివేయబడతాయి.
ఆగిన అన్ని మల్టీ-యాక్సిల్ వాహనాలు మే 2, 2025 న రాత్రి 9:00 గంటల తర్వాత ముందుకు సాగడానికి అనుమతించబడతాయి. ఈ సమయంలో ట్రాఫిక్ సజావుగా సాగేలా చూసేందుకు ప్రయాణీకులు సహకరించాలని కోరుతున్నాం.