
లుక్స్ ముఖ్యం కాదు నటనే ముఖ్యం అని నిరూపించాడు స్టార్ హీరో విజయ్ సేతుపతి. ప్రతిభ ఉంటే ప్రేక్షకులే నెత్తిమీద పెట్టుకుంటారు అనడానికి ఉదాహరణ విజయ్ సేతుపతి. ఎంతో మంది అభిమాన నటుడు విజయ్ సేతుపతి. విజయ్ సేతుపతి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్‌తోపాటు తెలుగు, హిందీలోనూ అభిమానులను సొంతం చేసుకున్నాడు విజయ్. సినిమా రంగంలోకి రాకముందు విజయ్ చాలా కష్టమైన జీవితం గడిపాడు. ఇప్పుడు స్టార్ గా ఎదిగిన తర్వాత కూడా ఆయన సాదాసీదా జీవితాన్ని గడుపుతున్నారు. మిగతా సెలబ్రెటీలలా హంగు ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్ గా ఉంటాడు మక్కల్ సెల్వన్. విజయ్ సేతుపతి తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు.
సహజమైన నటనతో మక్కల్ సెల్వన్ గా పేరు తెచ్చుకున్నాడు. విజయ్ సేతుపతి దుబాయ్‌లో అకౌంటెంట్ గా చేశారు. తర్వాత ఇండియాకు వచ్చి ఓ థియేటర్ కంపెనీలో అకౌంటెంట్‌గా చేరారు. ఆతర్వాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ సినిమాల్లో అవకాశాలు అందుకున్నాడు. ఆతర్వాత హీరోగా మారి ప్రేక్షకులను సక్సెస్ అయ్యారు. ఆతర్వాత ఇప్పుడు విలన్ గా మెప్పిస్తున్నాడు. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు విలన్ గా చేస్తూ రాణిస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా విజయ్ సేతుపతి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
తాజాగా విజయ్ సేతుపతి నటించిన మహారాజా సినిమాకు గాను ఉత్తమ నటుడిగా బిహైండ్‌వుడ్స్ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు స్వీకరించిన తర్వాత విజయ్ మాట్లాడుతూ.. మహారాజ సినిమా కంటే ముందు తన కెరీర్ లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను అన్నారు. మహారాజ సినిమా తన కెరీర్ లో ఎంతో మార్పు తీసుకువచ్చిందని అన్నారు విజయ్. మహారాజ కంటే ముందు అందరూ తన కెరీర్ అయిపోయిందన్నారని చెప్పారు విజయ్. ఇక మహారాజ సినిమా తనకు ఎంతో ప్రత్యేకమైన సినిమా అని.. ఈ సినిమా విజయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. మహారాజ సినిమా కంటే ముందు దాదాపు మూడేళ్లు నా సినిమాలు మంచి ఆడలేదు. అందరూ నా కెరీర్ అయిపోయిందని మాట్లాడుకున్నారు. కానీ ఈ సినిమా వచ్చిన తర్వాత.. విజయ్ సేతుపతి అనగానే మహారాజ సినిమాలో నటించాడు కదా అని అంటున్నారు. అంతలా నా కెరీర్ ను మార్చింది ఈ సినిమా అంటూ ఎమోషనల్ అయ్యారు విజయ్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..