
దేశంలోని అతిపెద్ద వార్తా నెట్ వర్క్ టీవీ9 నిర్వహించిన ‘వాట్ ఇండియా థింక్స్ టుడే’ గ్లోబల్ సమ్మిట్ 2025 మూడవ ఎడిషన్ శుక్రవారం ప్రారంభమైంది. మొదటి రోజే భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొని టీవీ9 నెట్ వర్క్ పై ప్రశంసలు కురిపించారు.ఈ కార్యక్రమంలో టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి రౌడీ హీరో విజయ్ దేవరకొండ , బాలీవుడ్ సినీతార యామీ గౌతమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ అనేక విషయాలపై స్పందించారు. ఈ కార్యక్రమంలో తన కొత్త సినిమా కింగ్ డమ్ టీజర్ రిలీజ్ చేశారు విజయ్. అలాగే ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కింగ్ డమ్ టీజర్ కు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇస్తే బాగుంటుందని అనుకున్నట్లు చెప్పారు. ఆయనను కలిసి విషయం చెప్పగానే వెంటనే ఒప్పుకున్నారని.. దర్శకుడు చెన్నైలో ఉన్నారని చెప్పినా.. నువ్వు ఉన్నావ్ గా అంటూ వాయిస్ ఓవర్ ఇచ్చారని చెప్పుకొచ్చారు.
అలాగే స్టార్ డమ్, దక్షిణా సినిమాల గురించి మాట్లాడారు. ఒకప్పుడు బెంగాలీ సినిమా భారతదేశాన్ని పాలించేదని, అప్పట్లో బాలీవుడ్ కూడా అదే స్థానంలో ఉండేదని.. ఇప్పుడు దక్షిణాది సినిమా ట్రెండ్ సెట్టర్ గా మారుతుందని మీరు నమ్ముతారా అని అడగ్గా.. విజయ్ స్పందిస్తూ.. “దక్షిణ సినిమాకు ఇది చాలా అందమైన సమయం. మన గురించి ప్రజలకు తెలియని కాలం ఉండేది. అప్పుడు హిందీ సినిమా ప్రమాణాలు ఎక్కువగా ఉండేది. ప్రపంచ స్థాయిలో భారతదేశానికి హిందీ సినిమా ఒక పెద్ద స్థానాన్ని సృష్టించింది. కానీ ఇప్పటి నుంచి 5 ఏళ్ల తర్వాత మరికొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. బహుశా ప్రతిదీ భారతీయ సినిమా అయిపోవచ్చు. కాబట్టి నేను దానిలో ఒక భాగమైనందుకు చాలా సంతోషంగా ఉన్నాను” అంటూ చెప్పుకొచ్చారు.
ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ సినిమా విజయ్ కెరీర్ ను మలుపు తిప్పింది. ఈ మూవీ తర్వాత విజయ్ గీత గోవిందం సినిమాతో మరో హిట్ అందుకున్నారు. ఆ తర్వాత తెలుగులో అనేక సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం కింగ్ డమ్ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు విజయ్. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో వచ్చిన ఈ టీజర్ మూవీపై భారీ అంచనాలను క్రియేట్ చేసింది.
ఇది చదవండి : Tollywood: చేసిన ఒక్క సినిమా డిజాస్టర్.. కట్ చేస్తే.. అమ్మడు జోరు ఇప్పట్లో ఆగేలా లేదుగా..
Tollywood: గ్లామర్ షోతో మెంటలెక్కిస్తోన్న హీరోయిన్.. వరుస సినిమాలు చేస్తున్న రానీ క్రేజ్.. ఆఫర్స్ కోసం..
Ram Charan : రామ్ చరణ్ ఫేవరేట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? పాన్ ఇండియా సెన్సేషన్.. కానీ ఇప్పుడు..
Actress Laya: హీరోయిన్ లయ కూతురిని చూశారా.. ? అప్పుడే సినిమాల్లోకి వచ్చేసిందిగా.. ఫోటోస్ చూస్తే..
Tollywood: తెలుగులో జోరు పెంచిన యంగ్ హీరోయిన్.. అమ్మడు ఇప్పట్లో ఆగేలే లేదుగా..