విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్ డమ్. ఈ సినిమా జులై 31 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురుచూసిన చిత్రం ఇది. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్, వెంకటేష్ ముఖ్య పాత్రలు పోషించారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. మొదటి షో నుంచి కింగ్ డమ్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది.
ఈ సక్సెస్ సెలబ్రేషన్ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ఈ సక్సెస్ నాకు చాలా ముఖ్యం.. ఉదయం నుంచి అందరూ ఎమోషనల్ అవుతున్నారు. థియేట్సర్ నుంచి ఫోన్ చేసి అన్న మనం సక్సెస్ కొట్టినం అని ఫోన్ చేస్తున్నారు. మీ అందరి ప్రేమ వల్లే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యింది. తెలుగు ప్రజలు నా వెనకుండి సపోర్ట్ చేశారు. నేను చెప్పినట్టు ఇదంతా మీ ప్రేమ, వెంకన్న స్వామి ఆశీసులు. అందరిని త్వరలోనే కలుస్తా.. నాకు సినిమా శుక్రవారం విడుదల అంటేనే నాకు భయం కానీ నాగ వంశీ సినిమా మీద నమ్మకంతో గురువారమే విడుదల చేశారు. అనుకున్నట్టే ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ ప్రేమ అందిస్తున్న ప్రేక్షకులకు అందరికి నా థాంక్యూ.. తారక్ అన్నతోనే మేము మొదలుపెట్టాం. థాంక్యూ అన్న అని చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
