
తమిళ చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్ ఆంటోని. నటుడిగా, గాయకుడిగా, నిర్మాతగా, సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నారు. 2005లో విడుదలైన సుక్రాన్ సినిమాతో తమిళ పరిశ్రమలోకి అరంగేట్రం చేసారు. ఇందులో కీలకపాత్రలో కనిపించాడు విజయ్. అలాగే అతడు సంగీతం అందించిన మొదటి సినిమాతోనే తమిళ అభిమానుల నుండి భారీ స్పందన వచ్చింది.తమిళంలో అనేక హిట్ చిత్రాలను అందించిన విజయ్ ఆంటోనీ తెలుగులోనూ ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత 2012లో నాన్ అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. అటు గాయకుడిగా, ఇటు నటుడిగా రాణిస్తున్నారు విజయ్. అతను చివరిసారిగా 2024లో దర్శకుడు థానా దర్శకత్వం వహించిన హిట్లర్ చిత్రంలో నటించాడు. విజయ్ ఆంటోనీ నటించిన ఈ చివరి చిత్రం మిశ్రమ సమీక్షలను అందుకుంది. ప్రస్తుతం గగన మోర్గాన్, వల్లి మయిల్, అగ్ని సిరాకుగల్, కాకి, శక్తి తిరుమగన్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలు వరుసగా విడుదలయ్యే అవకాశం ఉంది.
తాజాగా పహాల్గామ్ దాడి పై విజయ్ చేసిన పోస్ట్ పై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అయితే తన పోస్ట్ పై వచ్చిన నెగిటివ్ కామెంట్స్ పై వివరణ ఇచ్చాడు విజయ్ ఆంటోని.”నా పోస్టును తప్పుగా అర్థంచేసుకున్నవారికి…” అంటూ రాసుకొచ్చారు. “కాశ్మీర్లో దారుణమైన మారణహోమానికి పాల్పడ్డారు. దీని ఏకైక లక్ష్యం బలమైన ఐక్యత బంధాన్ని విచ్ఛిన్నం చేయడమే. భారత ప్రభుత్వం, మనం భారతీయులు మన సార్వభౌమత్వాన్ని బలమైన హస్తంతో కాపాడుకుంటాం” అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం విజయ్ చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.
— vijayantony (@vijayantony) April 28, 2025
అంతకు ముందు విజయ్ చేసిన పోస్ట్ పై తీవ్ర వివాదం ఏర్పడింది. దాడిని ఖండిస్తూ, మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతూ ఆయన పోస్ట్‌లో చేసిన పోస్ట్ విమర్శలకు దారితీసింది. “కాశ్మీర్లో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు నా హృదయపూర్వక సంతాపం. ఇది మనందరికీ భారతీయులకు బాధాకరమైన క్షణం. అదే సమయంలో, మనలాంటి పాకిస్తానీలతో పాటు శాంతి, ఆనందాన్ని కోరుకునే పాకిస్తాన్‌లోని 5 మిలియన్ల మంది భారతీయుల గురించి కూడా మనం ఆందోళన చెందాలి. ద్వేషం కంటే ప్రేమ, మానవత్వాన్ని ఎంచుకుందాం” అని ఆయన ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.
— vijayantony (@vijayantony) April 27, 2025
ఇవి కూడా చదవండి :
Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?
Tollywood: సినిమాలు వదిలేసి వాచ్‌మెన్‌గా మారిన నటుడు.. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో తోపు యాక్టర్..
Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..
Tollywood: ఒకప్పుడు తినడానికి తిండి లేక నీళ్లు తాగి బతికింది.. ఇప్పుడు ఇండస్ట్రీనే షేక్ చేస్తోన్న హీరోయిన్..