
మహాభారతంలోని గొప్పవ్యక్తుల్లో ఒకరైన మహాత్మ విదురుడు మంచి ఆలోచనాపరుడు. నీతి కలిగిన వ్యక్తి, ఆదర్శ పురుషుడు. ఆయన తన విధానాలు, ఆలోచనల కారణంగా హస్తినాపురానికి ప్రధానమంత్రి పదవిని సాధించారు. ఆయన విధానాలు ప్రస్తుత యుగంలో కూడా చాలా అనుసరనీయంగా ఉన్నాయి. ఆయన తన విధానాలలో మానవజాతి సంక్షేమం కోసం అనేక ముఖ్యమైన విషయాలను చెప్పారు. ధృతరాష్ట్ర మహారాజు దాదాపు అన్ని విషయాలలోనూ విదురుడి సలహా తీసుకునేవాడు. మహాభారత యుద్ధానికి ముందు మహాత్మా విదురుడు, ధృతరాష్ట్రుడి మధ్య జరిగిన చర్చను విదుర్ నీతి అని అంటారు. విదురుడు మూర్ఖుడికి ఉన్న నాలుగు లక్షణాల గురించి చెప్పాడు. ఈ రోజు ఆ లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం.. ఎవరైనా తమ జీవితంలో మోసం , నష్టం బారిన పడకుండా ఉండాలంటే వారిని గుర్తించి.. అలాంటి వ్యక్తి నుంచి దూరంగా ఉండాలి. ఎందుకంటే అలాంటి వ్యక్తులతో పరిచయం కూడా మిమ్మల్ని పతనానికి తీసుకుని వెళ్ళవచ్చు.
ఎప్పుడూ కోపంగా ఉండే వ్యక్తులు
విరుద నీతి ప్రకారం మూర్ఖుల సంకేతాల్లో ఒకటి ఎప్పుడూ కోపంగా ఉండడం. ఏ పని చేయలేని వ్యక్తి, ఏ విధమైన పని చేయని వ్యక్తి ఇతరులపై కోపాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాడు. అంతేకాదు ఎటువంటి కారణం లేకుండా ఎప్పుడూ కోపంగా ఉండే వ్యక్తులు పెద్ద మూర్ఖులు. అలాంటి వారు పదే పదే ఇతరులపై తమ కోపాన్ని వ్యక్తం చేస్తారు. వారి వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఏదైనా పనిలో తప్పు జరిగితే వారు తమ కోపాన్ని ఎదుటి వ్యక్తిపై చూపిస్తారు. అలాంటి వారు మూర్ఖులు. వీరికి దూరంగా ఉండాలి.
తాను తప్పు చేస్తూ ఇతరులను నిందించేవాడు
విదుర నీతిలో తాను తప్పు చేస్తూ ఎల్లప్పుడూ ఇతరుల తప్పులను ఎత్తి చూపడానికి ప్రయత్నించే వారు ముర్కుడు. ఇతరులంటే అసూయపడేవారు.. ఇతరులు చేసే ప్రతి పనిలో తప్పులు వెతుకుతారని చెప్పబడింది. వీరి ప్రవర్తన ఎల్లప్పుడూ ఇతరుల పట్ల కఠినంగా ఉంటుంది. ఇతరులను చూసి సంతోషంగా ఉండలేరు. ఇలాంటి వ్యక్తుల నుంచి దూరం పాటించాలి. జీవితంలో అవకాశం దొరికినప్పుడల్లా వీరు మిమల్ని మోసం చేయవచ్చు.
ఇవి కూడా చదవండి
పూర్వీకుల శ్రాద్ధ కర్మలను ఆచరించనివాడు
విదురుడి చెప్పిన ప్రకారం ఎలాంటి మతపరమైన ఆచారాలను ఎప్పుడూ నిర్వహించని వారిని కూడా మూర్ఖులుగా పరిగణిస్తారు. తల్లిదండ్రుల లేదా పూర్వీకుల శ్రాద్ధ కర్మలు చేయని వారు లేదా వారి శాంతి కోసం ఎటువంటి మతపరమైన ఆచారాలు చేయని వారు మూర్ఖుల వర్గంలోకి వస్తారు. అలాంటి వ్యక్తులు వారి జీవితంలో ఎల్లప్పుడూ ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
నిజమైన స్నేహితుడు లేని వాడు
మీరు జీవితంలో మోసపోకుండా లేదా నష్టపోకుండా ఉండాలనుకుంటే నిజమైన స్నేహితులు లేని వ్యక్తుల నుంచి దూరంగా ఉండండి. అలాంటి వ్యక్తులు చాలా దుర్మార్గులు, స్వార్థపరులు కనుక వారు మీతో కూడా గొడవ పడవచ్చు. అటువంటి వ్యక్తి మూర్ఖుడితో సమానం. లాంటి వారితో స్నేహం చేయడం సరైనది కాదని విదురుడు సూచించాడు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.Vi