
క్రికెట్లో ఎంతో మంది ఆటగాళ్లు క్యాచ్‌లు పడుతుంటారు. కొంతమంది మంచి ఫీల్డర్లు ఉంటారు.. వాళ్లు అసాధ్యం అనుకున్న క్యాచ్‌లను కూడా అద్భుతంగా అందుకుంటూ.. వావ్ అనిపిస్తారు. అలాంటి ఫీల్డర్లను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండియా, సౌతాఫ్రికా ఆటగాళ్లు మంచి ఫీల్డింగ్ చేస్తారనే పేరుంది. అలాగే పాకిస్థాన్ టీమ్ అంటే చాలా ఫీల్డింగ్‌తో వాళ్లు ఏంటి సంబంధం అన్నట్లు జోకులు పేలుతాయి. పాపం.. వాళ్ల ఫీల్డింగ్ సాండెడ్స్ ఎప్పుడూ వీక్‌గానే ఉంటాయి. కానీ, అలాంటి పాకిస్థాన్‌లో ఓ ఆటగాడు కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. చూస్తుంటే.. ఆ క్యాచ్ అందుకుంది మన కింగ్ కోహ్లీ అనిపిస్తుంది కదు. కానీ, అతను విరాట్ కోహ్లీ కాదు.
అమీర్ జమాల్ అని ఓ పాకిస్థాన్ క్రికెటర్. పాక్ తరఫున 8 టెస్టులు, 3 వన్డేలు ఆడాడు. ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో కరాజీ కింగ్స్ తరఫున ఆడుతూ.. ఈ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. కరాచీ కింగ్స్ వర్సెస్ క్వెట్టా గ్లాడియేటర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో గ్లాడియేటర్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆ జట్టు ఆటగాడు రిలీ రోసోవ్ గాల్లోకి ఆడిన షాట్.. అద్భుతంగా ముందుకు డైవ్ చేస్తూ పట్టుకున్నాడు. నిజం చెప్పండి.. మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పలేదు కదా.. ఒక వెళ్ల ఎవరైనా నిజాయితీగా ఫీల్డర్ కరెక్ట్‌గా పేరు చెప్పి ఉంటే మీరే సూపర్ క్రికెట్ ఫ్యాన్. నిజం చెప్పాలంటే.. క్యాచ్ పడుతున్న సమయంలో ఒక యాంగిల్లో అతను కోహ్లీని కనిపిస్తున్నాడు కదా.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..