
రంజీ ట్రోఫీ 2025 ఫైనల్లో కరుణ్ నాయర్ తన అద్భుతమైన శతకంతో అదరగొట్టాడు. విజయ్ హజారే ట్రోఫీలో వరుస సెంచరీలతో ఆకట్టుకున్న అతడు, రంజీ ట్రోఫీ ఫైనల్లోనూ తన ఫామ్‌ను కొనసాగించాడు. విదర్భ, కేరళ జట్ల మధ్య జరిగిన ఈ పోరులో నాల్గో రోజు నాయర్ తీవ్రమైన ఒత్తిడిలోనూ తన అద్భుతమైన బ్యాటింగ్‌తో 132 పరుగులు చేసి జట్టును 286 పరుగుల ఆధిక్యంలో నిలిపాడు. 184 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో తన శతకాన్ని పూర్తి చేసిన నాయర్, ఈ విజయంతో సెలక్టర్లకు గట్టి సందేశం పంపించాడు. దేశవాళీ క్రికెట్లో అన్ని ఫార్మాట్లను కలిపి అతనికి ఇది 9వ సెంచరీ కావడం విశేషం.
ఈ మ్యాచ్‌ను చూసేందుకు కరుణ్ నాయర్ భార్య స్టేడియంలో హాజరైంది. తన భర్త సెంచరీ చేయగానే ఆమె స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చి చప్పట్లు కొడుతూ సంతోషం వ్యక్తం చేసింది. కేవలం ఆమె మాత్రమే కాకుండా, స్టాండ్స్‌లోని ఇతర ప్రేక్షకులు కూడా లేచి అతనికి ఘనంగా అభినందనలు తెలిపారు. గత 13 మ్యాచ్‌ల్లో 8 సెంచరీలు సాధించడం ద్వారా కరుణ్ తన స్థాయిని మరోసారి నిరూపించుకున్నాడు. ఇకపోతే, గతంలో విజయ్ హజారే ట్రోఫీలోనూ అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. 8 ఇన్నింగ్స్‌లో 779 పరుగులు చేసి, 5 శతకాలు, 1 అర్ధశతకంతో సత్తా చాటాడు.
నాగ్‌పూర్‌లో జరిగిన రంజీ ట్రోఫీ ఫైనల్లో నాల్గో రోజు ఆట ముగిసే సమయానికి కరుణ్ నాయర్ అజేయంగా 132 పరుగులు చేశాడు. అతని స్ట్రోక్‌ప్లే ప్రశాంతంగా ఉండటంతో పాటు, రెండు వైపులా పరుగులు చేయడంలో సునాయాసంగా కనిపించాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతని కన్సిస్టెన్సీ, క్రీజ్‌లో ఉన్న పట్టు, మ్యాచ్‌ను ఆదినంలోకి తీసుకెళ్లే విధానం ఆకట్టుకున్నాయి. నాయర్ సెంచరీకి చేరుకున్న క్షణంలో తన హెల్మెట్‌ను తీసి, బ్యాట్‌ను పైకెత్తి డ్రెస్‌రూమ్ వైపు ఊపాడు. అనంతరం తన రెండు గేర్లను కిందకు దింపి ‘9’ అని తన వేళ్లతో సూచించాడు, ఇది ఈ సీజన్లో రెండు ప్రధాన టోర్నమెంట్లలో అతను చేసిన సెంచరీల సంఖ్యను తెలియజేసింది.
అయితే విదర్భ జట్టుకు ఈ ఇన్నింగ్స్ సునాయాసంగా సాగలేదనే చెప్పాలి. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 37 పరుగుల ఆధిక్యంతో ఆరంభించిన విదర్భ, తొలిరోజే కొన్ని వికెట్లు కోల్పోయింది. కేరళ బౌలర్లు ప్రదర్శించిన క్రమశిక్షణ బౌలింగ్ వల్ల విదర్భకు తక్కువ పరుగులే వచ్చాయి. అయితే నాయర్ తన సహచర బ్యాట్స్‌మన్ మాలేవర్‌తో కలిసి జట్టును నిలబెట్టాడు. మాలేవర్ 153 పరుగులు చేసి, రెండో ఇన్నింగ్స్‌లో 73 పరుగులు చేసి జట్టుకు మరింత బలాన్ని అందించాడు.
ఇక 19వ ఓవర్లో వచ్చిన ఓ కీలకమైన మిస్‌ఫీల్డ్ కారణంగా నాయర్ ఇన్నింగ్స్ కొనసాగింది. కేరళ ఫీల్డర్ అక్షయ్ చంద్రన్ తన క్యాచ్‌ను చేజార్చుకున్నాడు. ఆ క్యాచ్ విజయవంతమై ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదేమో. కానీ ఆ తప్పిదాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న నాయర్, విదర్భ జట్టును గెలుపు దిశగా నడిపించాడు. మొత్తం మీద, ఈ ఇన్నింగ్స్ ద్వారా నాయర్ తన స్థాయిని నిరూపించుకోవడమే కాకుండా, బీసీసీఐ సెలెక్టర్ల దృష్టిని తనపై మరల్చుకునే ప్రయత్నం చేశాడు.
💯 for Karun Nair 👏
A splendid knock on the big stage under pressure 💪
It’s his 9⃣th 1⃣0⃣0⃣ in all formats combined this season, and the celebration says it all👌🙌#RanjiTrophy | @IDFCFIRSTBank | #Final
Scorecard ▶️ https://t.co/up5GVaflpp pic.twitter.com/9MvZSHKKMY
— BCCI Domestic (@BCCIdomestic) March 1, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.