
Anaya Bangar Key Comments on Cricketers: భారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కుమారుడు ఆర్యన్ బంగర్ గత సంవత్సరం తన రూపాన్ని మార్చుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆర్యన్ బంగర్ లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకుని, ఒక అమ్మాయిగా అనన్య బంగర్గా మారింది. దీంతో ప్రపంచం ముందు తన కొత్త గుర్తింపును సృష్టించుకుంది. అయితే, ఈ సమయంలో అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. అనన్య బంగర్ ఒక షాకింగ్ విషయాన్ని వెల్లడించడంతో.. ఈ టాపిక్ హీట్ పెంచుతోంది. ఇటీవల ఇంటర్వ్యూలో అనన్య బంగర్ మాట్లాడుతూ, చాలా మంది క్రికెటర్లు అభ్యంతరకరమైన నగ్న చిత్రాలను పంపుతూ, తనను వేధించారని ఆరోపించింది.
చాలా మంది క్రికెటర్లు నాకు అశ్లీల ఫోటోలు పంపారు – అనన్య బంగర్
భారత మాజీ క్రికెటర్, కోచ్ సంజయ్ బంగర్ కుమార్తె అనన్య బంగర్, తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ క్రికెట్లో తన భవిష్యత్తును నిర్మించుకోవాలని నిర్ణయించుకుంది. అయితే, క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలనే నిర్ణయం అనన్యకు చాలా కష్టమని నిరూపితమైంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అనన్య బంగర్ ఎన్నో షాకింగ్ విషయాలు వెల్లడించింది. దీంతో పాటు, బంగర్ చాలా మంది క్రికెటర్ల గురించి షాకింగ్ విషయాలు చెప్పడం గమనార్హం.
అనన్య బంగర్ వీడియో..
‘लल्लनटॉप बैठकी’ में इस बार हमारी मेहमान हैं सोशल मीडिया इंफ्लुएंसर अनाया बांगर. अनाया पहले आर्यन बांगर के नाम से जानी जाती थीं. इस इंटरव्यू में उन्होंने ट्रांस महिला के रूप में अपने अनुभव साझा किए. बिना कहे न्यूड तस्वीरें भेजने वाले खिलाड़ी और एक वरिष्ठ क्रिकेटर की डिमांड. अनाया… pic.twitter.com/c15j8R6IYN
— The Lallantop (@TheLallantop) April 17, 2025
“లింగ మార్పు కోసం నాకు చాలా మంది నుంచి మద్దతు లభించింది. అదే సమయంలో నేను కొంతమంది నుంచి వేధింపులను కూడా ఎదుర్కొన్నాను. కొంతమంది క్రికెటర్లు తమ నగ్న చిత్రాలను నాకు పంపారు. ఈ సమయంలో నేను కొంతమంది సీనియర్ ఆటగాళ్ల నుంచి దుర్భాషలను ఎదుర్కోవలసి వచ్చింది. నేను ముషీర్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్, యశస్వి జైస్వాల్ వంటి అనేక మంది ప్రముఖ ఆటగాళ్లతో క్రికెట్ ఆడాను. క్రికెట్లో చాలా అభద్రత ఉంది. ఇందులో ఒక వ్యక్తి అందరి ముందు దుర్భాషలాడతాడు. తరువాత అదే వ్యక్తి వచ్చి నాతో కూర్చుని నా నగ్న చిత్రాలను అడుగుతాడు” అంటూ అనన్య బంగర్ షాకింక్ న్యూస్ చెప్పింది.
అనన్య బంగర్ మరో సంఘటనను వెల్లడిస్తూ, “నేను భారతదేశంలో ఉన్నప్పుడు, నా పరిస్థితి గురించి ఒక పాత క్రికెటర్‌తో చెప్పాను. అతను కారులో వెళ్దాం అని, మీతో పడుకోవాలనుకుంటున్నాను” అని షాకిచ్చాడని తెలిపింది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..