
ఎంఎస్ ధోని-దీపక్ చాహర్ అనుబంధం ఎంతో ప్రత్యేకమైనది. దీపక్ చాహర్‌ను విశ్వసనీయ బౌలర్‌గా తీర్చిదిద్దడంలో ధోని కీలక పాత్ర పోషించాడు. గతంలో CSK విజయాల్లో చాహర్ తనదైన ముద్రవేశాడు. అయితే, IPL 2025లో CSK అతనిని రిటైన్ చేయలేదు, అలాగే మళ్లీ వేలంలో కొనుగోలు చేయలేదు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ముంబై ఇండియన్స్ అతన్ని తమ జట్టులోకి తీసుకుంది. CSK vs MI మ్యాచ్‌లో దీపక్ చాహర్ అద్భుతంగా రాణించాడు. బ్యాటింగ్‌లో విలువైన పరుగులు చేయడంతో పాటు, రాహుల్ త్రిపాఠి వికెట్ కూడా తీశాడు. వికెట్ తీయగానే అతను తన ఆగ్రహాన్ని ప్రదర్శించాడు, మ్యాచ్ మొత్తంలో ఎంతో దూకుడుగా కనిపించాడు. ఈ విషయాన్ని ధోని గమనించి ఉండొచ్చని భావిస్తున్నారు. ఆట ముగిసిన తర్వాత, ప్లేయర్లు ఒకరితో ఒకరు కరచాలనం చేసుకుంటుండగా, ధోని తనదైన శైలిలో చహర్‌తో సరదాగా వ్యవహరించాడు.
సహజంగా హాస్యప్రియుడు అయిన ధోని, తన బ్యాట్‌తో దీపక్ చాహర్‌ను సరదాగా కొట్టాడు. ఈ ఘటన స్టేడియంలో నవ్వులు పూయించింది. అభిమానులు కూడా ఈ వీడియోను సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఇది ధోని-చాహర్ మధ్య ఉన్న అనుబంధాన్ని, స్నేహాన్ని స్పష్టంగా చూపించింది. గతంలో కూడా ధోని, చాహర్ మధ్య సరదా వాగ్వాదాలు, ఆటపట్టింపులు జరిగాయి. MSD ఎప్పుడూ చాహర్‌ను సరదాగా ఆటపట్టించడం క్రికెట్ అభిమానులకు తెలిసిందే.
మ్యాచ్ విషయానికొస్తే, ముంబై ఇండియన్స్ తొలుత బ్యాటింగ్ చేసి, కానీ నూర్ అహ్మద్ విరుచుకుపడటంతో కష్టాల్లో పడిపోయింది. ఈ లెఫ్ట్-ఆర్మ్ స్పిన్నర్ 4 కీలక వికెట్లు తీసి MI దూకుడుకు అడ్డుకట్ట వేశాడు. కానీ, MI బౌలర్లు కూడా వెనుకబడి లేరు. యువ స్పిన్నర్ విఘ్నేష్ పుత్తూర్ మూడు వికెట్లు తీసి CSK పై ఒత్తిడి పెంచాడు.
అయితే, CSK కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ అర్థ సెంచరీతో జట్టును విజయానికి దగ్గర చేసాడు. చివరి ఓవర్లో ఉత్కంఠ భరితమైన పరిస్థితులు నెలకొన్నా, రచిన్ రవీంద్ర ధైర్యంగా ఆడి CSKకు విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్ పూర్తిగా హై వోల్టేజ్ థ్రిల్లర్‌గా మారి, అభిమానులను అలరించింది.
ఐపీఎల్లో CSK vs MI మ్యాచ్‌లు ఎప్పుడూ ప్రత్యేకమే. కానీ, ఈసారి మ్యాచ్ ముగిసిన తర్వాత ధోని-చాహర్ సరదా లీలా అందరి దృష్టిని ఆకర్షించింది. దీపక్ చాహర్ CSK జెర్సీని వదిలి MI జెర్సీ వేసుకున్నా, ధోని మాత్రం తనదైన స్టైల్లో మిత్రుడిపై సరదా చేసేందుకు వెనుకాడలేదు. ఈ దృశ్యాలు అభిమానులకు మధురమైన క్షణాలుగా నిలిచాయి.
MS Dhoni giving BAT treatment to Deepak Chahar😭pic.twitter.com/2uYGLkFdpy
— ` (@lofteddrive45) March 23, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.