
ఐపీఎల్ 2025లో జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ తన ఆటతీరుతోనే కాదు, తన గొప్ప మనసుతోనూ అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. ఈ మ్యాచ్ మహారాజా యదవీంద్రా సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగగా, విరాట్ కోహ్లీ 54 బంతుల్లో 73 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, దేవ్‌దత్ పడిక్కల్ 35 బంతుల్లో 61 పరుగులు చేయడంతో ఆర్సీబీకి వరుసగా ఐదో అవుట్‌స్టేషన్ విజయం లభించింది. ఈ గేమ్‌లో కోహ్లీ తన దూకుడు, ఆటపై పట్టుదలతోనే కాదు, తన హృదయాన్ని చాటుతూ మరో యువ క్రికెటర్‌కు స్ఫూర్తిగా నిలిచాడు.
మ్యాచ్ ముగిసిన తర్వాత పంజాబ్ కింగ్స్‌కు చెందిన యువ ఆటగాడు ముషీర్ ఖాన్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టాడు. “విరాట్ భయ్యా ముందు నేను భావోద్వేగానికి లోనయ్యాను. కంటతడి పెట్టాను. ‘మీ బ్యాట్‌తోనే నేను ఎన్నో పరుగులు చేశాను. సర్ఫరాజ్ అన్నయ్య మీరు ఇచ్చిన బ్యాట్‌ను ఉపయోగించడానికి నాకు ఇచ్చాడు. దాంతో నేను మంచి స్కోర్లు చేశాను’ అని చెప్పాను. అప్పుడు విరాట్ భయ్యాను, ‘మీ దగ్గర ఉన్న బ్యాట్లలో ఒకదాన్ని నాకు ఇవ్వండి ప్లీజ్. అది వాడిపోయినదైనా పరవాలేదు. ఒక బ్యాట్ మాత్రం ఇవ్వండి’ అని అడిగాను” అని ముషీర్ చెప్పాడు. ఈ మాటలు విని విరాట్ కోహ్లీ తనదైన శైలిలో స్పందించి, తన బ్యాట్‌ను ముషీర్‌కి ఇచ్చాడు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
విరాట్ కోహ్లీ తన సహచర ఆటగాళ్లకు, సీనియర్లకు గౌరవం ఇచ్చే విధానంతో పాటు యువ క్రికెటర్లకు ప్రోత్సాహం ఇచ్చే గుణంతో కూడా గుర్తింపు పొందాడు. ముషీర్ తన టీమ్‌మేట్స్‌కు కోహ్లీ ఇచ్చిన బ్యాట్‌ను చూపిస్తూ ఎంతో ఆనందంగా ఫీలయ్యాడు. కోహ్లీ అంటే తనకు పిచ్చి అని చెప్పి, ఆయనకు ఆత్మదానం చేసినట్టుగా తన అభిమానాన్ని వ్యక్తం చేశాడు. ఇప్పటివరకు ముషీర్ ఖాన్ ఈ సీజన్లో ఏ మ్యాచ్ ఆడకపోయినా, ఈ సంఘటన అతని జీవితంలో ఓ మరిచిపోలేని క్షణంగా నిలిచిపోతుంది. పంజాబ్ కింగ్స్ అతనిని రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది, ఇది ముషీర్‌కు భవిష్యత్‌లో మంచి అవకాశాలు తెచ్చిపెట్టే అవకాశముంది. విరాట్ కోహ్లీ గొప్పతనాన్ని తెలియజేసే ఈ సంఘటన మరెందరికో యువ ఆటగాళ్లకు ఆదర్శంగా నిలుస్తోంది.
KING KOHLI, AN EMOTION..!!!! ❤️
– Musheer Khan said “Maine to Ro Diya Virat Kohli bhaiya ke samne” when King Kohli gave his bat to him. 🥹
— Tanuj (@ImTanujSingh) April 21, 2025
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.