
భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ విడాకుల తర్వాత ఆర్జే మహ్వాష్ వార్తల్లో నిలిచారు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ సందర్భంగా చాహల్, మహ్వాష్ కలిసివున్న దృశ్యాలు వైరల్ కావడంతో, వీరిద్దరూ ప్రేమలో ఉన్నారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఆ తర్వాత వీరు డేటింగ్లో ఉన్నారన్న వార్తలు మరింత ఊపందుకున్నాయి. ఇదిలా ఉండగా, తాజాగా ఆర్జే మహ్వాష్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆమె తన డ్రీమ్ బాయ్, ప్రేమ, భవిష్యత్తు జీవిత భాగస్వామిపై తన మనసులోని మాటను బయటపెట్టింది.
ఆర్జే మహ్వాష్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన వీడియోలో ప్రేమ, సంబంధాల గురించి స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. “నా జీవితంలోకి వచ్చే ఏ అబ్బాయైతే ఉంటాడో.. అతనే నా సర్వస్వము అయ్యాడు. అతనే నా ప్రాణస్నేహితుడు, నా ప్రియుడు, నా భర్త. నా జీవితం పూర్తిగా అతని చుట్టూ తిరుగుతుంది. నాకు అవసరం లేని వ్యక్తులు వద్దు. ఒకసారి నిజమైన ప్రేమ వస్తే, మిగతా వారితో మాట్లాడటానికి ఆసక్తి ఉండదు. నాకు నా భర్త చాలు” అని మహ్వాష్ తన వీడియోలో చెప్పుకొచ్చింది.
ఈ వీడియో ఆమె వ్యక్తిగత భావోద్వేగాలను వ్యక్తపరుస్తుందని స్పష్టంగా అర్థమవుతోంది. దీనికి ఆర్జే మహ్వాష్ “ఒకే ఒక్కరు ఉంటారు” అనే క్యాప్షన్ ఇచ్చింది, ఇది నెటిజన్లలో మరింత ఆసక్తిని పెంచింది.
ఆర్జే మహ్వాష్ పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ కావడమే కాకుండా, యుజ్వేంద్ర చాహల్ స్వయంగా లైక్ చేయడం, ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. యుజ్వేంద్ర చాహల్, ఆర్జే మహ్వాష్ డేటింగ్లో ఉన్నారా? వీరి సంబంధం నిజమైనదేనా? అనే ప్రశ్నలు ఇంకా అధికారికంగా సమాధానం పొందాల్సి ఉంది. కానీ ఈ కొత్త వీడియోతో పాటు చాహల్ స్పందన, వీరి మధ్య నిజంగా ఏదో నడుస్తోందని అభిమానులకు సందేహం లేకుండా చేసింది.
చాహల్ తన వ్యక్తిగత జీవితాన్ని పబ్లిక్‌గా పెద్దగా ప్రదర్శించనప్పటికీ, ఆర్జే మహ్వాష్ మాత్రం ప్రేమపై ఓపెన్‌గా మాట్లాడటం వారి బంధాన్ని మరింత హైలైట్ చేసింది. ఈ రూమర్లకు మరింత స్పష్టత రావాలంటే ఇద్దరూ కలిసి అధికారిక ప్రకటన చేయాల్సి ఉంటుంది. అయితే, ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరి ప్రేమకథ హాట్ టాపిక్‌గా మారింది. మరి, భవిష్యత్తులో చాహల్, మహ్వాష్ తమ బంధాన్ని అధికారికంగా ప్రకటిస్తారా లేదా అన్నది వేచి చూడాలి!
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..