
ఓ భార్య చాలా పైశాచికంగా, క్రూరంగా ప్రవర్తించింది. ఆమె అలా చేస్తున్న విషయం బయటికి చెప్తే.. ఈ సమాజం నమ్ముతుందో లేదో అని ఓ భర్త కెమెరాలను నమ్ముకున్నాడు. తనపై ప్రతి రోజు తన భార్య జరుపుతున్న హింసను ఎలాగైనా బయటపెట్టాలని తన బెడ్రూమ్లో రహస్య కెమెరా పెట్టాడు. ఎప్పటిలానే తన ఆ భార్య తన భర్తపై బెడ్ మీద హింసించడం మొదలుపెట్టింది. ఆ దృశ్యాలన్ని ఆ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ వీడియో తీసుకొని.. భర్త నేరుగా వెళ్లి పోలీసులకు చూపించాడు. దాంతో పోలీసులు కూడా ఆశ్చర్యపోయి.. వామ్మో ఈమె మామూలు ఆడది కాదంటూ ఆమెపై కేసు నమోదు చేశారు.
ఇంతకీ ఆ భార్య ఎలా వేధించింది, ఎందుకు హింసింది అనే విషయానికి వస్తే.. మధ్యప్రదేశ్లోని పన్నాలో ఇద్దరు దంపతులు కాపురం ఉంటున్నారు. కాగా, ఆ భార్యకు డబ్బు పిచ్చి, డబ్బు, బంగారం, వెండి ఇవ్వాలంటూ తరచూ భర్తను వేధించేది. చాలా సార్లు తన తల్లి సమక్షంలోనే దాడి కూడా చేసేది. తన భార్య చేస్తున్న హింసను తట్టుకోలేకపోయిన అతను రహస్య కెమెరాలు పెట్టి, తన భార్య నిజ స్వరూపం, తనను ఎలా కొట్టి హింసిస్తుందో ఈ సమాజానికి తెలిసేలా చేశారు. తన భార్య ఈ విధంగా తనను శారీరంగా వేధిస్తోందంటూ ఆ వీడియో చూపించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, ఆ మహిళ తన భర్తపై దాడి చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
‘मेरी पत्नी मुझे पीटती है सर, मुझे मेरी पत्नी से बचाओ सर’
लोकेश ने मध्य प्रदेश के पन्ना में पुलिस अधीक्षक कार्यालय में एक आवेदन दिया, जिसमें अपनी पत्नी की क्रूरता की कहानी सुनाई और मदद की मांग की।
उसकी पत्नी द्वारा उसे पीटने का सीसीटीवी फुटेज सामने आया। pic.twitter.com/6qFeqbtrVh
— Manoj Singh (@PracticalSpy) April 2, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.