
Karun Nair hit 18 runs In just 1 Over in Jasprit Bumrah: టీ20 మ్యాచ్‌లో ఎవరైనా జస్ప్రీత్ బుమ్రాను ఎదుర్కొనేందుకు భయపడుతుంటారు. అసలు బుమ్రా ఓవర్లో పరుగులు చేసేందుకు చాలా ఇబ్బందులు పడుతుంటారు. కానీ, 7 ఏళ్ల తర్వాత తొలి మ్యాచ్ ఆడుతోన్న కరుణ్ నాయర్ మాత్రం ఈ దిగ్గజ బౌలర్‌ని కూడా వదిలిపెట్టలేదు. బుమ్రా విసిరిన ఒకే ఓవర్లో 18 పరుగులు చేసి అతని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాడు. ఢిల్లీ తరపున ఐపీఎల్లో రీఎంట్రీ చేసిన కరుణ్ నాయర్ ముంబై టీంలోనే అత్యుత్తమ బౌలర్‌ను చిత్తు చేయడం గమనార్హం.
బుమ్రాకు ఊహించని షాక్..
బుమ్రా విసిరిన ఆరో ఓవర్లో ఒక సిక్స్‌తో మొదలుపెట్టిన కరుణ్ నాయర్.. ఆ తర్వాత బౌండరీ, మరో సిక్స్ బాదాడు. దీంతో బుమ్రా ఓవర్లో 2 సిక్స్‌లు బాది అందర్నీ ఆశ్చర్యపరిచాడు. కరుణ్ బ్యాటింగ్ చూసి బుమ్రా కూడా చేతులెత్తేశాడు. ముంబై పేసర్ తన లైన్స్ అండ్ లెంగ్త్స్‌ను కోల్పోయాడు. ఇక చివరి బంతికి కరుణ్ నాయర్ 2 పరుగులు చేసి మొత్తంగా 18 పరుగులను బుమ్రా ఓవర్ నుంచి పిండుకున్నాడు. తన తొలి ఐపీఎల్ సెంచరీకి చేరువైన నాయర్.. 89 పరుగులకు అవుటయ్యాడు.
Making an IMPACT with INTENT 👊
Karun Nair takes on Jasprit Bumrah to reach his #TATAIPL FIFTY after 7⃣ years 💙
Updates ▶ https://t.co/sp4ar866UD#DCvMI | @DelhiCapitals pic.twitter.com/C7a59EkjxD
— IndianPremierLeague (@IPL) April 13, 2025
ప్రస్తుతం మ్యాచ్ పరిస్థితి..
ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ 15.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. క్రీజులో అశుతోష్ శర్మ ఉన్నాడు. అభిషేక్ పొరెల్ 33, కరుణ్ నాయర్ 89, కేఎల్ రాహుల్ 15, అక్షర్ పటేల్ 9, స్టబ్స్ 1 పరుగు చేసి పెవిలియన్ చేరారు. ఇక ముంబై బౌలర్లలో కర్ణ్ శర్మ 3 వికెట్లు పడగొట్టగా, దీపర్ చాహర్, బుమ్రా, శాంట్నర్ తలో వికెట్ పడగొట్టారు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..