
Mumbai Indians vs Royal Challengers Bengaluru, 20th Match: వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో తలపడుతోన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు భారీ స్కోర్ దిశగా సాగుతోంది. అయితే, 2025 జనవరిలో వెన్ను గాయం తర్వాత జస్ప్రీత్ బుమ్రా తొలిసారి తిరిగి రావడంతో ఈ మ్యాచ్‌పై అందరికీ ఆసక్తి నెలకొంది. ముంబై జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
జస్ప్రీత్ బుమ్రా తన మొదటి ఓవర్లోనే విరాట్ కోహ్లీని ఎదుర్కొన్నాడు. అయితే, ఇది అభిమానులకు మంచి కాంపిటేషన్‌లా అనిపించింది. ఇద్దరు భారత దిగ్గజాలు ఒకరినొకరు ఎదుర్కొనేందుకు సిద్ధమవ్వగా.. ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలని ఫ్యాన్స్ కాసింత ఆసక్తి చూపించారు. అయితే, బుమ్రా వేసిన మొదటి ఓవర్లోనే విరాట్ ఆధిపత్యం ప్రదర్శించాడు.
బెంగళూరు ఇన్నింగ్స్ విరాట్ ఎదుర్కొన్న మొదటి బంతికే సిక్సర్ కొట్టి బుమ్రాకు గ్రాండ్ వెల్ కం చెప్పాడు. బుమ్రా బౌలింగ్‌లో భారీ షాక్ ఆడి కోహ్లీ తన పంథా ఏంటో చూపించాడు. అయితే, ఆ తర్వాత బుమ్రా కూడా బలంగా తిరిగి వచ్చాడు. ఆ తర్వాత కోహ్లీకి ఒక యార్కర్‌ను విసిరాడు. దానిని మాజీ ఆర్సీబీ కెప్టెన్ చక్కగా డిఫెండ్ చేశాడు.
King 👑 ra Luchas 🤙❤️🔥🔥 @mipaltan #RCBvsMI #MIvsRCB #rcb #RCB #ViratKohli𓃵 #ViratKohli #KING #KingKohli
— Venkat Chowdary (@SaiVenkat113) April 7, 2025
ప్రస్తుతం మ్యాచ్ గురించి చెప్పాలంటే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 17 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయి 192 పరుగులు సాధించింది. రజత్ పాటిదార్ 61, జితేష్ శర్మ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు.
లియామ్ లివింగ్‌స్టోన్ (0 పరుగులు), విరాట్ కోహ్లీ (67 పరుగులు)లను హార్దిక్ పాండ్యా పెవిలియన్‌కు పంపాడు. దీంతో హార్దిక్ పాండ్యా 200 టీ20 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. దేవదత్ పడిక్కల్ (37 పరుగులు) ను విఘ్నేష్ పుతూర్ అవుట్ చేయగా, ఫిల్ సాల్ట్ (4 పరుగులు) ను ట్రెంట్ బౌల్ట్ అవుట్ చేశాడు.