
భారత దిగ్గజ మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తాజాగా కోచ్ అవతారం ఎత్తాడు. పైగా కోచింగ్ ఇచ్చింది ఎవరికో తెలుసా.. ప్రపంచ ప్రఖ్యాత బిల్ గేట్స్‌కు. ప్రస్తుతం బిల్ గేట్స్ భారత పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలువురు ప్రముఖులను కలుస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం క్రికెట్ గాడ్ సచిన్‌ను కలిశారు. ఇద్దరూ కలిసి సరదాగా క్రిన్నిస్ ఆడారు. ఇదేంటి కొత్త ఆట అనుకుంటున్నారా? క్రికెట్, టెన్నిస్ మిక్స్ చేసి ఆడితే అదే క్రిన్నిస్.
సచిన్ సరదాగా బిల్ గేట్స్‌తో టెన్నిస్ బ్యాట్‌తో క్రికెట్ షాట్స్ ఆడాడు. అది చూసి గేట్స్ సర్ప్రైజ్ అయ్యాడు. బిల్ గేట్స్‌కు క్రిన్నిస్ రూల్స్ నేర్పించి, టెన్నిస్ కోర్టులో క్రికెట్ బ్యాట్‌తో ఆటడం నేర్పించాడు. ఇదంతా సరదాగా గేట్స్ ఫౌండేషన్, సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ ప్రమోషన్ కోసం సాగింది. ఆ తర్వాత సచిన్, గేట్స్ కలిసి ముంబై ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ వడా పావు కూడా తిన్నారు. గేట్స్‌తో సరదాగా ఆడిన ఈ ఆట వీడియోను సచిన్ తన సోషల్ మీడియా అకౌంట్స్‌లో పోస్ట్ చేశారు. ఆ వీడియో వైరల్‌గా మారింది. మరి ఇంకెందుక ఆలస్యం కిందున్న ఆ వీడియోను మీరూ చూసేయండి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.