
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 (PSL)లో భాగంగా 12వ మ్యాచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోల్స్ బారిన చిక్కుకుంది. ఓ తప్పుతో పాకిస్తాన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్స్ లాహోర్ ఖలందర్స్‌ను 33 పరుగుల తేడాతో ఓడించింది. కానీ ఈ విజయం కంటే, మ్యాచ్‌లోని తప్పుల గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది. మొదట, ముల్తాన్ బౌలర్ వికెట్ తీసిన సంబరాల్లో తన సొంత సహచరుడు ఉస్మాన్ ఖాన్‌ను గాయపరిచాడు. మ్యాచ్ తర్వాత, అవార్డు ప్రదానోత్సవంలో, పాకిస్తాన్ మాజీ కెప్టెన్, వ్యాఖ్యాత రమీజ్ రాజా PSLని IPL అంటూ పిలిచాడు.
మ్యాచ్ తర్వాత ప్రజెంటేషన్‌లో, బెస్ట్ క్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందిస్తూ, రమీజ్ రాజా పొరపాటున టోర్నమెంట్‌ను PSL అని కాకుండా HBL IPL అంటూ పిలిచాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా, మంగళవారం జరిగిన అత్యధిక స్కోరింగ్ మ్యాచ్‌లో లాహోర్ ఖలందర్స్‌ను ఓడించడం ద్వారా ముల్తాన్ సుల్తాన్స్ ఈ సీజన్లో తొలి విజయాన్ని నమోదు చేసింది. కాగా, ఖలందర్స్‌కు చెందిన ఫఖర్ జమాన్‌ను అవుట్ చేసినందుకు ముల్తాన్‌కు చెందిన ఐరిష్ ఆటగాడు జోష్ లిటిల్ బెస్ట్ క్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.
Catch of the ” HBL IPL ” Rambo at it again pic.twitter.com/8Ww8vtvQIt
— Zak (@Zakr1a) April 22, 2025
యాసిర్ షా అజేయ ఇన్నింగ్స్..
ఈ సీజన్లో తన తొలి మ్యాచ్‌లో సుల్తాన్స్ ఓపెనర్ యాసిర్ ఖాన్ 87 పరుగులతో అజేయమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత పేసర్ ఒబైద్ షా నేతృత్వంలోని బలమైన బౌలింగ్ దాడి 229 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఖలందర్స్‌ను 20 ఓవర్లలో 9 వికెట్లకు 195 పరుగులకే పరిమితం చేసింది. యాసిర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆధారంగా, ముల్తాన్ 5 వికెట్లకు 228 పరుగులు చేసింది. PSL చరిత్రలో ముల్తాన్ క్రికెట్ స్టేడియంలో ఇదే అత్యధిక జట్టు స్కోరు. యాసిర్ 44 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో సహా 87 పరుగులు చేశాడు.
మొహమ్మద్ రిజ్వాన్‌తో కలిసి యాసిర్ 89 పరుగుల అద్భుతమైన ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రిజ్వాన్ 17 బంతుల్లో 32 పరుగులు చేశాడు. ఉస్మాన్ ఖాన్ 24 బంతుల్లో 39 పరుగులు, ఇఫ్తికార్ అహ్మద్ 18 బంతుల్లో 40 పరుగులు సాధించారు. లాహోర్ ఖలందర్స్ తరఫున సికందర్ రజా అత్యధికంగా అజేయంగా 50 పరుగులు చేశాడు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..