
Virat Kohli Angry Reaction: ఐపీఎల్ 2025లో భాగంగా 20వ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతోంది. దీనిలో హోమ్ టీం ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతోంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 5 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. దీంతో ముంబై జట్టుకు 222 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై ఇండియన్స్ ఆరంభంలో కొన్ని వికెట్లు కోల్పోయింది. కానీ, ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మతో స్థిరపడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలో యష్ దయాల్ వేసిన స్లో బాల్‌పై సూర్యకుమార్ యాదవ్ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ, బంతిని గాల్లోకి వెళ్లింది. వికెట్ కీపర్ జితేష్ శర్మ క్యాచ్ తీసుకోవడానికి దాదాపు సగం దూరం పరిగెత్తాడు. యష్ కూడా క్యాచ్ తీసుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో ఇద్దరి మధ్య సమన్వయం లేకపోవడంతో సూర్యకుమార్‌కు లైఫ్‌లైన్ వచ్చింది.
సూర్యకుమార్ క్యాచ్ వదిలేయడంతో విరాట్ కోహ్లీకి చాలా కోపం వచ్చింది. కోపంతో అరుస్తూ క్యాప్ తీసి నేలపై గట్టిగా విసిరి కొట్టాడు. ఈ వీడియో వైరల్ అవుతోంది.
యశ్ దయాళ్, జితేష్ శర్మలపై విరాట్ కోహ్లీ ఆగ్రహం..
CONFUSION BETWEEN YASH DAYAL AND JITESH SHARMA DROPPED SKY’S CATCH.
LOOK AT VIRAT KOHLI REACTION AT THE END😡🙃.#RCBvsMI #ipl #IPL2025 pic.twitter.com/8Kf0KDiScj— Aksh Chaudhary (@ChaudharyAkshS1) April 7, 2025
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ 12వ ఓవర్ రెండవ బంతికి, యష్ దయాల్ తన వైవిధ్యాన్ని ప్రదర్శించి స్లో బాల్ వేశాడు. సూర్యకుమార్ యాదవ్ పేస్ అందుకోలేకపోయాడు. దీంతో సూర్య గాల్లోకి షాట్ కొట్టాడు. జితేష్ శర్మ కూడా క్యాచ్ తీసుకోవడానికి ముందుకు పరిగెత్తాడు. కానీ, యష్ బంతి తన పైన గాలిలో ఉందని గ్రహించి, బంతిని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఈ ప్రయత్నంలో ఇద్దరి చేతులు ఢీకొన్నాయి. సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ జారిపోయింది. ఈ రకమైన ఫీల్డింగ్ చూసి, విరాట్ కోహ్లీ కోపంతో ఊగిపోయాడు. కోపంతో అరుస్తూ తన టోపీని నేలపై విసిరేశాడు.
అయితే, సూర్యకుమార్‌కు ఇచ్చిన లైఫ్ లైన్ ఆర్సీబీకి పెద్దగా సహాయపడలేదు. ఎందుకంటే, అదే ఓవర్ చివరి బంతికి అతను క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో సూర్య ఇన్నింగ్స్ 26 బంతుల్లో 28 పరుగులకు మించి వెళ్ళలేకపోయింది. ఈ విధంగా యష్ తన తప్పును సరిదిద్దుకుని జట్టుకు భారీ వికెట్ అందించాడు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..