
రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ బౌలర్లను చిత్తు చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) బ్యాట్స్మన్ ఇషాన్ కిషన్.. కేవలం 25 బంతుల్లో అర్ధ సెంచరీతో చెలరేగిపోయాడు. ఈ క్రమంలో మైదానంలో ఓ ఆసక్తికరమైన సీన్ చోటుచేసుకుంది.
రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నాడు. ఈక్రమంలో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ హైదరాబాద్ జట్టుకు అద్భుతమైన ఆరంభం ఇచ్చారు. ఈ డేంజరస్ జోడీ 19 బంతుల్లోనే 45 పరుగులు చేసింది.
ఇవి కూడా చదవండి
హాఫ్ సెంచరీ తర్వాత ఇషాన్ కిషన్ ఫ్లయింగ్ కిస్..
— kuchnahi123@12345678 (@kuchnahi1269083) March 23, 2025
అభిషేక్ 24 పరుగులకే ఔటయ్యాడు. కానీ ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్ భారీ స్కోర్లు సాధించి SRH ఐపీఎల్ చరిత్రలో ఐదవ అత్యధిక పవర్-ప్లే స్కోరును నమోదు చేశారు. హెడ్ పెవిలియన్ చేరిన తర్వాత ఇషాన్ కిషన్.. టాక్ ఆఫ్ ది ఉప్పల్గా మారిపోయాడు. ఈ బ్యాటర్ 25 బంతుల్లో అర్ధ సెంచరీ చేసి తన విమర్శకుల నోళ్లు మూయించాడు.
వరుస సిక్సర్లతో ఈ మైలురాయిని చేరుకున్న తర్వాత, ఇషాన్ తన భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోయాడు. అక్కడున్న ప్రేక్షకులకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. హైదరాబాద్ యజమాని కావ్య మారన్ ఇషాన్ కిషన్ ఊచకోత చూసి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు.