
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అదిరిపోయే ప్రదర్శనతో ముందుకు సాగుతోంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆర్సిబి రెండు మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ విజయాల్లో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్‌గా రజత్ పాటిదార్ కొత్తగా బాధ్యతలు స్వీకరించినప్పటికీ, కోహ్లీ సూచనలు అతనికి గొప్పగా సహాయపడ్డాయి. శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో జరిగిన సదరన్ డెర్బీ మ్యాచ్‌లో కోహ్లీ తన కెప్టెన్సీ అనుభవాన్ని ఉపయోగించి కీలకమైన సూచనలు అందించాడు. దీపక్ హుడా క్యాచ్‌కు వెనుక అప్పీల్ జరిగినప్పుడు, కోహ్లీ పాటిదార్‌ను DRS తీసుకోవాలని ఒప్పించాడు. పాటిదార్ మొదట కొంత సందేహంలో ఉన్నప్పటికీ, కోహ్లీ సూచనతో రివ్యూ తీసుకున్నాడు. ఫలితంగా RCBకు కీలకమైన వికెట్ లభించింది, దీని వల్ల CSK జట్టుపై మరింత ఒత్తిడి పెరిగింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌గా తన కొత్త పాత్రలో రజత్ పాటిదార్ ఆకట్టుకుంటున్నాడు. ముఖ్యంగా కోహ్లీ అందిస్తున్న సూచనల వల్ల RCB జట్టు దూకుడుగా ఆడుతూ విజయాలను అందుకుంటోంది. ఈ మ్యాచ్‌లో కూడా కోహ్లీ స్ట్రాటజీ విజయవంతమైంది.
రెండో ఓవర్లో జోష్ హాజిల్‌వుడ్ రెండు వికెట్లు తీసి RCBకు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. అనంతరం, భువనేశ్వర్ కుమార్ కూడా 5వ ఓవర్ మూడో బంతికి అవుట్ స్వింగర్‌తో హుడాను బురిడీ కొట్టించాడు. అప్పటికే హాఫ్-హార్ట్ అప్పీల్ వచ్చిందని కనిపించినా, పాటిదార్ పూర్తిగా రివ్యూ తీసుకోవాలా లేదా అనే విషయంలో సందేహంలో ఉన్నాడు. కోహ్లీ అతనికి రివ్యూ తీసుకోవాలని స్పష్టంగా సూచించడంతో, పాటిదార్ వెంటనే నిర్ణయం తీసుకున్నాడు. స్నికో మీటర్ ప్రకారం, బంతి బ్యాట్‌ను తాకినట్లు కన్ఫర్మ్ అయ్యింది, తద్వారా హుడా అవుట్ అయ్యాడు. ఈ కీలకమైన DRS వల్ల CSK బ్యాటింగ్ విభాగంలో మరింత ఒత్తిడి పెరిగింది.
కెప్టెన్‌గా పాటిదార్ అర్ధ సెంచరీ సాధించడం ద్వారా RCBకు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు. అతను చెపాక్ స్టేడియంలో అర్ధ సెంచరీ చేసిన రెండవ RCB కెప్టెన్‌గా నిలిచాడు. మ్యాచ్ ప్రారంభంలో CSK టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఫిల్ సాల్ట్ (16 బంతుల్లో 34, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్) ఓపెనింగ్‌లో దూకుడు చూపించగా, విరాట్ కోహ్లీ (30 బంతుల్లో 31, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) తన ఇన్నింగ్స్‌ను క్రమపద్ధతిలో నడిపించాడు. రజత్ పాటిదార్ (32 బంతుల్లో 51, నాలుగు బౌండరీలు, మూడు సిక్సర్లు) అర్ధ సెంచరీతో నిలకడగా ఆడాడు. చివర్లో టిమ్ డేవిడ్ (8 బంతుల్లో 22, ఒక ఫోర్, మూడు సిక్సర్లు) దుమ్మురేపాడు. ఈ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో RCB 20 ఓవర్లలో 196/7 పరుగులు చేసింది.
ఇక ఛేజింగ్ లో రచిన్ రవీంద్ర (31 బంతుల్లో 41, ఐదు ఫోర్లతో) కొంత సపోర్ట్ ఇవ్వడానికి ప్రయత్నించినా, CSKకు పెద్దగా సహాయం కాలేదు. యష్ దయాల్ (2/18), లియామ్ లివింగ్‌స్టోన్ (2/28) CSKపై పట్టు బిగించారు. ఎంఎస్ ధోని 16 బంతుల్లో 30 (మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడినా, CSK 146/8కి పరిమితమైంది.
Kohli called for that excellent review of hooda’s wicket#CSKvsRCB pic.twitter.com/D5TSFfdNBB
— Ritesh Yadav (@riteshy9034) March 28, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..