
దొంగలు మరీ దారుణంగా రెచ్చిపోతున్నారు. ఏకంగా పట్టపగలే దోపిడీలకు పాల్పడుతున్నారు. తాజాగా జరిగిన ఓ దొంగతనానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ముగ్గురు దుండగులు కామన్ సర్వీస్ సెంటర్లోకి చొరబడి రూ.3.5 లక్షలను దోచుకున్నారు. ఈ నెల ప్రారంభంలో పట్టపగలు జరిగిన ఈ సంఘటన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీసీటీవీలో రికార్డైంది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
వీడియోలో, దుండగులలో ఒకరు కామన్ సర్వీసెస్ సెంటర్లోకి ప్రవేశించి అక్కడ ఉన్న అధికారితో మాట్లాడటం ప్రారంభించినట్లు చూడవచ్చు. ఈలోగా, అతని ఇద్దరు సహచరులు సెంటర్లోకి ప్రవేశించారు. వారు ముసుగులు ధరించి, పిస్టల్ తీసి అధికారి వైపు చూపించారు. మొదట వచ్చిన నిందితుడు నిఘా ఉంచడానికి బయటకు వెళ్ళాడు. ఇంతలో, కార్యాలయంలో ఉన్న దుండగులలో ఒకరు అధికారి మొబైల్ ఫోన్‌ను లాక్కున్నాడు. రెండవ వ్యక్తి టేబుల్ డ్రాయర్ తెరిచి నగదు తీసుకున్నాడు. దీంతో ఆ అధికారి ప్రతిఘటించి తన కుర్చీని కూడా వారి వైపు విసిరాడు.
డబ్బు చేతికందగానే దొంగలు అక్కడి నుండి పారిపోయారు. దోపిడీ జరిగిన ఈ కామన్ సర్వీసెస్ సెంటర్ వాణి విహార్ ప్రాంతంలో ఉంది. ఇందులో మినీ ATM, డబ్బు బదిలీ, ఆధార్ కార్ సెంటర్, ఇతర సేవలు ఈ కేంద్రంలో అందుబాటులో ఉన్నాయి. అయితే దోపిడీ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగి గుర్తు తెలియని దుండగులపై కేసు నమోదు చేశారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకోవడానికి గాలింపు చర్యలు చేపట్టారు.
In #Dehradun, 3 Looter entered a public service center and looted RS 3.5 lakh in broad Day light😱#Uttarakhand #Loot #AliaBhatt #TejRan #TATAIPL #KaranKundrra #ToxicTheMovie #TrainHijack pic.twitter.com/CIIcktb8KF
— Sunaina Bhola (@sunaina_bhola) March 13, 2025
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి