
మార్చి 25న నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన టోర్నమెంట్‌లోని ఐదవ మ్యాచ్‌లో గోల్డెన్ డక్‌గా ఔటవడం ద్వారా ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ తన ఐపీఎల్ (IPL) 2025 సీజన్‌ను చెత్తగా ఆరంభించాడు.
ఐపీఎల్లో గ్లెన్ మాక్స్వెల్ మరోసారి విఫలమయ్యాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో ఓ చెత్త రికార్డ్ నమోదు. గ్లెన్ మాక్స్వెల్ పరుగులేమీ చేయకుండా ఔట్ కావడంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యధిక డకౌట్లుగా రికార్డు సృష్టించాడు.
ఇవి కూడా చదవండి
టైటాన్స్ స్పిన్నర్ ఆర్. సాయి కిషోర్ మాక్స్వెల్ ను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. ఇది ఐపీఎల్ లో గ్లెన్ మాక్స్వెల్ 19వ డకౌట్.
ఈ సీజన్ ప్రారంభంలో, గుజరాత్ టైటాన్స్‌తో ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ సున్నాకి వెనుదిరిగి, 18 డకౌట్లతో మాక్స్వెల్, దినేష్ కార్తీక్‌లతో సమం చేశాడు. తాజాగా, గ్లెన్ మాక్స్వెల్ మరో ముందడుగు వేసి మరో డక్‌తో చెత్త రికార్డులో అగ్రస్థానంలో నిలిచాడు.
Twin Strikes, ft. Sai Kishore ☝️☝️
The #GT spinner thrills the home crowd with back-to-back wickets 👏
Updates ▶ https://t.co/PYWUriwSzY#TATAIPL | #GTvPBKS | @gujarat_titans pic.twitter.com/fEdBTy3McZ
— IndianPremierLeague (@IPL) March 25, 2025
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యధిక డక్ ఔట్స్ అయిన ప్లేయర్లు..
గ్లెన్ మాక్స్వెల్ – 130 ఇన్నింగ్స్‌లలో 19 సార్లు డకౌట్ అయ్యాడు.
రోహిత్ శర్మ – 253 ఇన్నింగ్స్‌లలో 18 సార్లు డకౌట్ అయ్యాడు.
దినేష్ కార్తీక్ – 234 ఇన్నింగ్స్‌లలో 18 సార్లు డకౌట్ అయ్యాడు.
పియూష్ చావ్లా – 92 ఇన్నింగ్స్‌లలో 16 సార్లు డకౌట్ అయ్యాడు.
సునీల్ నరైన్ – 111 ఇన్నింగ్స్‌లలో 16 సార్లు డకౌట్ అయ్యాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..