
ఇటీవలె ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాకిస్థాన్ ఎంత ఫేలవ ప్రదర్శన కనబర్చిందో చూశాం. టోర్నీకి హోస్ట్ కంట్రీగా వ్యవహరిస్తూ కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలవలేక, అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకుంది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో, ఆ తర్వాత టీమిండియా చేతిలో ఓటమి పాలైంది. చివరల్లో బంగ్లాదేశ్‌పైనైనా గెలిచి.. పరువు నిలుపుకుందాం అనుకుంటే వారి ఆశలపై వరణుడు నీళ్లు చల్లాడు. మొత్తంగా ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా పాకిస్థాన్ జట్టు.. గ్రూప్ స్టేజ్‌లోనే ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి నిష్క్రమించింది.
అయితే.. తాజాగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఐఎస్ఎల్(పాకిస్థాన్ సూపర్ లీగ్) ట్రోఫీని గ్రాండ్‌గా లాంచ్ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 11 నుంచి పీఎస్ఎల్ సీజన్ ప్రారంభం కానుంది. ఇది పదో సీజన్ కావడంతో కాస్త గ్రాండ్‌గా ట్రోఫీని లాంచ్ చేశారు. అయితే.. ఈ ట్రోఫీ లాంచ్ ఈవెంట్‌ను ఒక సినిమాటిక్ వేలో, మూడు నిమిషాలకు పైగా వీడియోను రిలీజ్ చేశారు. అందులో కరాచీకి దగ్గరల్లో సముద్రంలో ఒక నిధి ఉందని, దాన్ని బయటికి తీస్తే అది పీఎస్ఎల్ 10వ సీజన్ ట్రోఫీ అన్నట్లు కాస్త ఎక్కువైనా బాగానే వీడియో వచ్చేలా ప్లాన్ చేసింది.
దీని కోసం ఏకంగా పాకిస్థాన్ ఆర్మీని కూడా వాడేసింది పాక్ క్రికెట్ బోర్డు. అయితే.. పాకిస్థాన్‌లో ఆట తక్కువైనా.. ఇలాంటి వాటికేం తక్కువలేదంటూ క్రికెట్ అభిమానులు సరదాగా కామెంట్ చేస్తున్నారు. కాగా.. ఐపీఎల్ 2025 సీజన్ ప్రకటించిన వెంటనే పీఎస్ఎల్ కూడా అదే టైమ్‌లో వచ్చేలా ప్రకటించడంపై విమర్శలు వచ్చాయి. ఐపీఎల్, పీఎస్ఎల్ రెండింటిలోనూ ఆడే ఆటగాళ్లను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే పాకిస్థాన్ ఈ విధంగా చేసిందంటూ క్రికెట్ అభిమానులు అంటున్నారు. ఏది ఏమైనా.. ప్రస్తుతం పీఎస్ఎల్ ట్రోఫీ లాంచ్ వీడియో వైరల్‌గా మారింది.
Celebrating a decade of HBL PSL with a spectacular trophy unveiling in Karachi’s coastal waters 🌊
Presenting 𝙇𝙪𝙢𝙞𝙣𝙖𝙧𝙖 – the #HBLPSLX prize – in all its glory 🏆 pic.twitter.com/uRh7aiOZW6
— PakistanSuperLeague (@thePSLt20) March 13, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..