
Ubaid Shah Accidentally Slapped Usman Khan Video: పాకిస్తాన్లో జరుగుతున్న టీ20 లీగ్‌లో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్ 22న ముల్తాన్ సుల్తాన్స్ వర్సెస్ లాహోర్ ఖలందర్స్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా జరిగిన ఒక సంఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. వికెట్ తీసిన ఆనందంలో ఓ ప్లేయర్ సెలబ్రేషన్స్‌లో చిన్న అవశృతి చోటు చేసుకుంది. అనుకోకుండా చేయి తగలడంతో ఓ ఆటగాడు గాయపడ్డాడు. అయితే, ఇదంతా ఉద్దేశపూర్వకంగా జరగలేదు. అయినప్పటికీ ఆ పొరపాటు మరో ఆటగాడిని కిందపడిపోయేలా చేసింది. ఈ విషయం ముల్తాన్ సుల్తాన్స్‌కు చెందిన ఇద్దరు ఆటగాళ్లు ఒబైద్ షా, ఉస్మాన్ ఖాన్లకు సంబంధించినది.
లైవ్ మ్యాచ్‌లో ‘చెంపదెబ్బ ఘటన’?
ఈ సంఘటన లాహోర్ ఖలందర్స్ ఇన్నింగ్స్ 15వ ఓవర్లో జరిగింది. ఈ ఓవర్ చివరి బంతికి ఒబైద్ షా సామ్ బిల్లింగ్స్ వికెట్ తీసుకున్నాడు. సెలబ్రేషన్స్ చేసుకునే క్రమంలో వికెట్ కీపర్ ఉస్మాన్ ఖాన్‌కు హై-ఫైవ్ ఇవ్వడానికి వెళ్ళాడు. కానీ, అతను దానిని సరిగ్గా అంచనా వేయలేకపోయాడు. దీంతో చేయి కాస్త అతని తలపై నేరుగా తగిలింది. ఈ సంఘటనలో ఉస్మాన్ ఖాన్‌కు స్వల్ప గాయమైంది. దీంతో అతను నేలపై పడిపోయాడు.
ఇవి కూడా చదవండి
ఇది కూడా చదవండి: MI Predicted Playing XI: ముంబై మ్యాచ్ విన్నర్ రీఎంట్రీ.. ఉప్పల్ స్టేడియంలో ఊచకోతే..
3 వికెట్లు పడగొట్టిన ఒబైద్ షా..
Rey 🤣🤣😭 pic.twitter.com/oj59d8N8H6
— Yaghnesh (@Yaghnesh1) April 22, 2025
అయితే, మంచి విషయం ఏమిటంటే వికెట్ కీపర్ ఉస్మాన్ ఖాన్ ఆ తర్వాత ఆటను కొనసాగించాడు. ఆ సంఘటన తర్వాత అతను మ్యాచ్‌లో ఒక క్యాచ్ కూడా తీసుకున్నాడు. ఒబైద్ షా గురించి చెప్పాలంటే, ఆ మ్యాచ్‌లో అతను 4 ఓవర్లలో 37 పరుగులకు 3 వికెట్లు పడగొట్టాడు. ఆ మ్యాచ్‌లో సామ్ బిల్లింగ్స్ అతని చివరి బాధితుడిగా మారాడు.
SRH Playing XI: టీమిండియా ప్లేయర్‌కి బిగ్ షాకిచ్చిన పాట్ కమిన్స్.. రాత్రికి రాత్రే ప్లేయింగ్ XI నుంచి ఔట్?
లాహోర్ ఖలందర్స్ పై ముల్తాన్ సుల్తాన్స్ విజయం..
Ubaid Shah dismisses Sam Billings and knocks out Usman Khan in the process! pic.twitter.com/x18JyZGem5
— PakPassion.net (@PakPassion) April 22, 2025
ఒబైద్ షా, ఉస్మాన్ ఖాన్ జట్టు ముల్తాన్ సుల్తాన్స్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది. ఆ జట్టు లాహోర్ ఖలందర్స్‌ను 33 పరుగుల తేడాతో ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముల్తాన్ సుల్తాన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 228 పరుగులు చేసింది. ఇందులో ఉస్మాన్ ఖాన్ 24 బంతుల్లో 39 పరుగులు చేశాడు. 229 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో లాహోర్ ఖలందర్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 195 పరుగులు మాత్రమే చేసింది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..