
వీడా వీ2 సిరీస్ స్కూటర్లు వినియోగదారులకు మరింత అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కంపెనీ చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో రూ.40 వేల తగ్గింపును ప్రకటించింది. వీటిలో వీడా వీ2 లైట్, ప్లస్, ప్రో అనే మూడు రకాలు ఉన్నాయి. వీడా వీ2 లైట్ అత్యంత తగ్గింపు ధరకు లభిస్తుంది. దీనిలో 2.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. పూర్తి సింగిల్ చార్జింగ్ పై సుమారు 94 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. గరిష్టంగా గంటకు 69 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. రైడ్, ఎకో అనే రెండు రకాల మోడ్ లతో ఆకట్టుకుంటోంది. ఏడు అంగుళాల టీఎఫ్ టీ టచ్ స్క్రీన్ డిస్ ప్లేతో సహా ఆధునిక ఫీచర్లు బాగున్నాయి.
వీ2 ప్లస్ లోని 3.44 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ సుమారు 143 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. అలాగే వీ2 ప్రోలో 3.94 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. సింగిల్ చార్జ్ పై 165 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. వీ2 సిరీస్ లోని రెండు మోడళ్లలో రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ లు ఉన్నాయి. వీటిని ఆరు గంటల్లో దాదాపు 80 శాతం చార్జింగ్ చేయవచ్చు. ప్రత్యేకతల విషయానికి వస్తే వీడా వీ2 స్వింగ్ ఆర్మ్ పై అమర్చిన పీఎంఎస్ మోటారుతో శక్తిని పొందుతుంది. దీని నుంచి 6 కేడబ్ల్యూ (8 బీహెచ్పీ) శక్తి, 26 ఎన్ఎం టార్క్ విడుదల అవుతుంది. వీ2 ప్లస్, ప్రో మోడళ్లు ఎకో, రైడ్, స్పోర్ట్స్, కస్టమ్ అనే నాలుగు రకాల మోడ్ లను పొందుతాయి. ప్లస్ గరిష్టంగా గంటకు 85 కిలోమీటర్లు, ప్రో 90 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెడుతుంది.
వీడా వీ1 ఎలక్ట్రిక్ స్కూటర్ మాదిరిగానే వీ2 సిరీస్ వాహనాలు కనిపిస్తాయి. వీటి మధ్య డిజైన్ పరంగా చిన్న తేడాలు మాత్రమే ఉంటాయి. కానీ రెండు కొత్త రంగులైన మాట్టే నెక్సస్ బ్లూ గ్రే, గ్లోసీ స్పోర్ట్స్ రెడ్ లలో ఆకట్టుకుంటున్నాయి. ఐదేళ్లు లేదా 50 కిలోమీటర్ల వారంటీతో కొత్త స్కూటర్ అందుబాటులోకి వచ్చింది. అలాగే బ్యాటర్ ప్యాక్ లు మూడేళ్లు లేదా 30 వేల కిలోమీటర్ల వారంటీతో వస్తాయి. క్రూయిజ్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ, రీజెనరేటివ్ బ్రేకింగ్ తదితర అదనపు ప్రత్యేకతలు ఉన్నాయి. వీ2 ఖాతాదారులు దేశవ్యాప్తంగా 250 కంటే ఎక్కువ నగరాల్లో ఉన్న 3100 చార్జింగ్ స్టేషన్ల బ్రాండ్ నెట్ వర్క్ ను యాక్సెస్ చేయవచ్చు.
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి