
వేణు స్వామి.. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా వాళ్ల జాతకాలు , రాజకీయం నాయకుల భవిషత్ చెప్తూ తెగ వార్తల్లో నిలిచాడు. సినీ ప్రేముఖులు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు. ఎప్పుడు విడిపోతారో ఈయనకు బాగా తెలుసంటాడు.. ఆ కామెంట్స్ తోనే వార్తల్లో నిలుస్తుంటాడు. గతంలో సమంత, నాగచైతన్య విడిపోతారు అంటూ గెస్ చేశాడు. ఆయన అన్నట్టే అది జరిగింది. అంతే నేను చెప్పింది చెప్పినట్టు జరుగుతుందని ఊదరగొట్టాడు.. దొరికిన యూట్యూబ్ ఛానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ.. ఆ హీరో హీరోయిన్ విడిపోతారు, పెద్ద హీరో అనారోగ్యానికి గురవుతాడు, ఓ సినీ పెద్ద చనిపోతాడు అంటూ పిచ్చిపిచ్చి కామెంట్స్ చేశాడు. సినిమా వాళ్లనే కాదు రాజకీయ నాయకులను కూడా వదల్లేదు వేణు స్వామి.
ఏపీ ఎన్నికల సమయంలో జగన్ ఘనవిజయం సాధిస్తారు అని చెప్పాడు అది జరగలేదు. దాంతో ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. ఆ దెబ్బకు రాజకీయ నాయకుల జాతకం చెప్పను అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆతర్వాత నాగచైతన్య, శోభిత పెళ్లి చేసుకున్నారో లేదో విడిపోతారు అంటూ మరోసారి తన నోటికి పని చెప్పాడు ఈ జ్యోతిష్కుడు. శుభమా అని ఆ ఇద్దరూ పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తే అపశకునాలు పలుకుతావా అని అక్కినేని ఫ్యాన్ మనోడిని ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. దాంతో క్షమించండి అంటూ క్షమాపణలు చెప్పుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి
తాజాగా ఉమెన్స్ కమిషన్ కు బహిరంగ క్షమాపణలు చెప్పాడు వేణు స్వామి. శోభిత, నాగచైతన్య విడిపోతారు అంటూ చేసిన కామెంట్స్ పై వేణు స్వామికి ఉమెన్స్ కమిషన్ నోటీసులు ఇచ్చింది. కాగా, అప్పుడే ఉమెన్స్ కమిషన్ నోటీసులను సవాల్ చేస్తూ వేణు స్వామి హైకోర్టుకు వెళ్లాడు. అక్కడ కూడా మనోడికి పనిజరగలేదు. ఉమెన్స్ కమిషన్ ముందు హాజరుకావాల్సిందే అని హైకోర్టు ఆదేశించింది. దాంతో తెలంగాణ ఉమెన్స్ కమిషన్కు వేణు స్వామి బహిరంగ క్షమాపణలు చెప్పాడు. ఇక పై ఇలాంటి అర్ధంపర్ధం లేని కామెంట్స్ చేస్తే ఊరుకునేది లేదు అంటూ ఉమెన్స్ కమిషన్ వేణు స్వామికి అక్షింతలు వేసింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.