
కలబంద అందం, ఆరోగ్యంలోనే కాకుండా వాస్తు శాస్త్రంలో కూడా ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది. ఈ కలబందను అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. పవిత్రంగా భావిస్తూ..ఇంట్లో పెంచుతారు. ఈ మొక్కను ఇంట్లో పెంచుకుంటే సంపద, శ్రేయస్సుకు లోటు ఉండదని నమ్ముతారు. అంతేకాదు.. ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల కొన్ని ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించకుండా, సానుకూల శక్తి ప్రవాహాన్ని కలబంద పెంచుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ కలబంద మొక్కను పెంచటానికి కొన్ని వాస్తు నియమాలను కూడా పాటించాలని నిపుణులు చెబుతున్నారు. లేదంటే నష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అవేంటంటే..
వాస్తు ప్రకారం ఇంట్లో కలబంద మొక్కలను నాటడం శుభప్రదంగా చెబుతారు. కలబంద మొక్క కష్టతరమైన జీవితాన్ని మెరుగుపరచడం మాత్రమే కాకుండా, ప్రతి పనిలోనూ విజయాన్ని తీసుకువస్తుంది. కలబంద మొక్క నాటిన చోట ప్రేమ, శ్రేయస్సు, సంపద, ప్రతిష్ట పెరుగుతాయని నమ్ముతారు. అందుకే కలబంద మొక్కను ఇంటికి తూర్పు వైపున నాటడం మంచిదని చెబుతున్నారు. అలాగే, ఇంటికి ఆగ్నేయ భాగంలో కూడా నాటవచ్చునని చెబుతున్నారు. ఉద్యోగంలో పురోగతి కావాలంటే కలబంద మొక్కను ఇంటికి పడమర వైపున నాటాలని సూచిస్తున్నారు. కలబంద మొక్కను పొరపాటున కూడా ఇంటికి వాయువ్య దిశలో నాటకూడదని సూచిస్తున్నారు.
వాస్తు ప్రకారం ఈ మొక్కను ఇంట్లో వాయువ్య దిశలో పెంచడం వల్ల అనేక ఇబ్బందులు వస్తాయని చెబుతున్నారు. అంతేకాదు.. ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. వాస్తు ప్రకారం కలబంద మొక్క పెంచటం వల్ల అనేక సమస్యలు తొలగిపోతాయని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఇంట్లో సరైన దిశలో కలబంద మొక్కను నాటడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఆ ఇంటిపై ఉంటాయి. సంపదకు లోటు ఉండదు. ఎవరి ఇంట్లో ఈ మొక్క ఉంటే వారి కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు. సమాజంలో పేరు, ప్రతిష్టలు పెరుగుతాయని విశ్వసిస్తారు.
ఇవి కూడా చదవండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం క్లిక్ చేయండి..