
ఏకాదశి తిథి విష్ణువుకు అంకితం చేయబడింది. హిందూ పంచాంగం ప్రకారం చైత్ర మాసంలో కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి తిథిని వరుథిని ఏకాదశి అంటారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువు, లక్ష్మీ దేవిని పూజించే సంప్రదాయం ఉంది. ఈ రోజున ఉపవాసం ఉండి నిర్మలమైన హృదయంతో పూజించే భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ రోజున తులసి దళాలకు సంబంధించిన కొన్ని పరిహరాలను చేయడం ద్వారా, కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు, సానుకూలత వస్తాయి.
వరూధుని ఏకాదశి 2025 తేదీ
వేద క్యాలెండర్ ప్రకారం చైత్ర మాసం కృష్ణ పక్ష ఏకాదశి తిధి ఏప్రిల్ 23న సాయంత్రం 4:43 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిధి ఏప్రిల్ 24న మధ్యాహ్నం 2:32 గంటలకు ముగుస్తుంది. ఉదయ తేదీ ప్రకారం ఏప్రిల్ 24న వరూధుని ఏకాదశి ఉపవాసం పాటిస్తారు.
తులసి దళంతో ఏకాదశి పరిహారాలు
ఏకాదశి రోజున తులసి మొక్కను ఇంటికి తీసుకురావడం లేదా తులసి మొక్కను నాటడం శుభప్రదంగా భావిస్తారు. కనుక వరూధుని ఏకాదశి రోజున తులసి మొక్కను నాటాలి. దీంతో జీవితంలో కలుగుతున్న సమస్యలు క్రమంగా ముగింపుకు రావడం మొదలవుతుంది. అదే సమయంలో ఇంటికి ఈశాన్య దిశలో తులసి మొక్కను నాటండి.
ఇవి కూడా చదవండి
తులసి పూజ
వరూధుని ఏకాదశి రోజున, బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని స్నానం చేయండి. తులసి మొక్కకు నీరు పెట్టండి. తరువాత దాని ముందు నెయ్యి దీపం వెలిగించండి. తులసికి సంబంధించిన మంత్రాన్ని జపించండి. ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. దీనితో పాటు పెండింగ్ పనులు కూడా పూర్తి అవుతాయి.
పూజలో తులసి
వరూధునిఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుకి సమర్పించే నైవేద్యంలో తులసి దళాలను ఉపయోగించాలని నిర్ధారించుకోండి. ఇలా వరూధుని ఏకాదశి రోజున చేసే పూజలు, పరిహరాలతో వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే జీవితంలో ఎటువంటి అడ్డంకులను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు