
అల్లు అర్జున్ అభిమానులను తీవ్రంగా నిరాశపర్చిన సినిమాల్లో వరుడు ఒకటి. గుణ శేఖర్ తెరకెక్కించిన ఈ చిత్రంపై ముందు నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. దీనికి తోడు హీరోయిన్ ఫేస్ కనిపించకుండా చేసి మూవీపై హైప్ పెంచారు. కానీ ఇవేవీ వరుడు సినిమాను గట్టెక్కించలేకపోయాయి. అలాగే హీరోయిన్ కోసం ఇంత సస్పెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదన్న విమర్శలు వినిపించాయి. మొత్తానికి అల్లు అర్జున్ కెరీర్ లోనే ఒక బిగ్గెస్ట్ డిజాస్టర్ గా వరుడు మూవీ నిలిచింది. ఇక ఇందులోని హీరోయిన్ విషయానికి వస్తే.. పంజాబ్ లోని అమృత్ సర్ కు చెందిన భానుశ్రీ మెహ్రాకు ఇదే మొదటి తెలుగు సినిమా. వరుడు కంటే ముందు ఈ భామ బాలీవుడ్ చిత్రం బచ్నా ఏ హసీనోలో అతిధి పాత్రలో తళుక్కుమంది. వరుడు సినిమా కూడా నిరాశపర్చడంతో భానుశ్రీకి తెలుగులోనూ పెద్దగా అవకాశాలు రాలేదు. చిల్కూరు బాలాజీ , ప్రేమతో చెప్పన , మహారాజా శ్రీ గాలిగాడు , లింగడు-రామలింగడు, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి, గోవిందుడు అందరి వాడేలే, రన్, మిస్ ఇండియా తదితర సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, సపోర్టింగ్ రోల్స్ లో మెరిసింది. చివరగా 2022లో 10th క్లాస్ డైరీస్ అనే సినిమాలో ఓ ప్రధాన పాత్రలో నటించింది భానుశ్రీ మెహ్రా.
సెకెండ్ ఇన్నింగ్స్..
కాగా చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత భానుశ్రీ మెహ్రా ఓ తెలుగు సినిమాలో నటిస్తోంది. ఎర్రచీర.. ది బిగినింగ్ పేరుతో తెరకెక్కుతోన్న ఓ మూవీలో భానుశ్రీ ఒక కీ రోల్ పోషిస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సినిమాలు ఎక్కువగా చేయకపోయినా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటోందీ అందాల తార. తన సొంత యూట్యూబ్ చానెల్ లో తన వ్లాగ్స్ చేసుకుంటోంది. ట్రావెలింగ్ వీడియోలను కూడా షేర్ చేస్తోంది. ఇక ఇన్ స్టా గ్రామ్ లో తరచూ తన గ్లామరస్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తుంటుందీ అందాల తార. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
భానుశ్రీ మెహ్రా లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..
వరుడు సినిమా గ్లామరస్ ఫొటోస్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..