
కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ఆ మధ్యన యూఐ సినిమాతో అభిమానులను పలకరించారు. వెరైటీ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రం ఉప్పీ అభిమానులను బాగానే ఆకట్టుకుంది. ఇప్పుడు 45 అనే మరో డిఫరెంట్ మూవీతో ఆడియెన్స్ కు పలకరించేందుకు రెడీ అయ్యాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. ఇందులో ఉప్పీతో పాటు మరో స్టార్ హీరో శివరాజ్ కుమార్, రాజ్ బి శెట్టి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలో బిజి బిజీగా గడుపుతున్నాడు ఉపేంద్ర. సినిమాల సంగతి పక్కన పెడితే ఉపేంద్ర వ్యక్తిగత జీవితం గురించి చాలా మందికి తెలియదు. ఉప్పీ భార్య ప్రియాంక త్రివేది కూడా పలు తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది. కొన్ని నెలల క్రితం ఉగ్రావతారం అనే సినిమాలోనూ మెయిన్ లీడ్ లో నటించి మెప్పించిందీ అందాల తార. ఇక వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఉపేంద్ర తప్పితే ప్రియాంక, ఇద్దరు పిల్లలు పెద్దగా బయట కనిపించరు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో మాత్రమే దర్శనమిస్తారు. ఇదిలా ఉంటే తాజాగా ఉపేంద్ర తన కూతురు ఐశ్వర్య పుట్టిన రోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేశాడు. ఈ సందర్భంగా తన కూతురికి కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపాడు ఉపేంద్ర.
ఇవి కూడా చదవండి
ఇక ఐశ్వర్య తన పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడీ ఫోటోలు వైరల్‌గా మారి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. పలువురు సినీ ప్రముఖులతో పాటు అభిమానులు, నెటిజన్లు ఐశ్వర్యకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు.
కూతురి పుట్టిన రోజు వేడుకల్లో ఐశ్వర్య..
కాగా ఐశ్వర్య ఉపేంద్ర 2008లో జన్మించింది. ఇప్పుడు ఆమెకు 17 సంవత్సరాలు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఐశ్వర్య కూడా త్వరలోనే సినిమాల్లోకి వస్తుందని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ రానుంది. ఇక ఉపేంద్ర కొడుకు పేరు ఆయుష్. ఇతను కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. రకరకాల ఫోటోలను అందులో షేర్ చేస్తుంటాడు. ఆయుష్ కు బైక్‌లంటే చాలా మక్కువ. ఎక్కువగా దేశ విదేశాలు తిరుగుతూ తన సమయాన్ని గడుపుతుంటాడు.
ఫ్యామిలీతో హీరో ఉపేంద్ర..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.