
శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది ఫలితాలు – వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఆదాయం – 11, వ్యయం – 5 | రాజపూజ్యాలు – 1, అవమానాలు – 3
ఈ రాశివారికి విశ్వావసు నామ సంవత్సరమంతా ఆడింది ఆటగా పాడింది పాటగా సాగిపోతుంది. ఉగాదితో లాభ స్థానంలోకి శని ప్రవేశిస్తున్నందువల్ల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న ఉద్యోగులు, నిరుద్యోగుల కల తప్పకుండా నెరవేరుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలు కలుగుతాయి. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. మే 18న దశమంలో రాహువు ప్రవేశంతో ఉద్యోగంలో అందలాలు ఎక్కడంతో పాటు ఉద్యోగులకు విపరీతంగా డిమాండ్ పెరుగుతుంది. మే 25న ధన స్థానంలోకి గురువు ప్రవేశంతో ఆదాయం బాగా పెరగడంతో పాటు, ఆస్తిపాస్తులు కలిసి రావడం, ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం కావడం వంటివి జరుగుతాయి. సొంత ఇంటి కల నెరవేరుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. సంపన్న కుటుంబంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఈ రాశివారు క్రమబద్ధంగా విష్ణు సహస్ర నామ స్తోత్రం చదువుకోవడం చాలా మంచిది. కుటుంబ జీవితం చాలా వరకు సాఫీగా సాగిపోతుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా, సాఫీగా సాగిపోతాయి.
లాభ స్థానంలోని శని వల్ల జూలై తర్వాత రాజయోగాలు కలుగుతాయి. రాజ సన్మానాలు జరిగే అవకాశం కూడా ఉంది. కొద్ది ప్రయత్నంతో అత్యధికంగా ఆర్థికాభివృద్ధి ఉంటుంది. అక్టోబర్, నవం బర్ నెలల్లో లాభ స్థానంలో మరోసారి నాలుగు, అయిదు గ్రహాల కూటమి ఏర్పడున్నందు వల్ల ఆదాయం పెరగడానికి, షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభించడానికి, ఆస్తిపాస్తులు కొనడానికి అవ కాశం ఉంది. నిరుద్యోగులకు, అవివాహితులకు, విద్యార్థులకు అనేక శుభ ఫలితాలు అనుభవా నికి వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. సోదరులతో ఆస్తి పంప కానికి సంబంధించిన వ్యవహారాలు సజావుగా, సానుకూలంగా సాగిపోతాయి. తరచూ శివార్చన చేయించడం వల్ల జీవితం మంచి మలుపు తిరిగే అవకాశం ఉంటుంది.
ఇది కూడా చదవిండి..మేష రాశి ఉగాది ఫలితాలు.. ఏలిన్నాటి శని ప్రభావంతో..