
శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది ఫలితాలు – మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఆదాయం 5, వ్యయం 5 | రాజపూజ్యాలు 3, అవమానాలు 11
ఉగాది రోజున ఈ రాశిలోకి శని ప్రవేశిస్తున్నందువల్ల ఈ రాశివారు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిది. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఆహార, విహారాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది. వ్యక్తిగత సమస్యలు పెరిగే సూచనలు కూడా ఉన్నాయి. ఆర్థిక వ్యవహారాల్లో నష్టపోయే అవకాశం ఉంది. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం తగ్గుతుంది.
మే 18న రాహువు వ్యయ స్థానంలోకి రావడం, మే 25న గురువు చతుర్థ స్థానంలోకి రావడం వల్ల ఖర్చులు అదుపు తప్పే అవకాశం ఉంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. సొంత ఇంటి ప్రయత్నాల్లో ఖర్చులు అంచనాలను మించుతాయి. వృత్తి, వ్యాపారాల్లో భారీగా అంచనాలు, లక్ష్యాలు పెట్టుకోకపోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి నిలకడగా సాగిపోతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. బంధువర్గంలో అనుకోకుండా మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి.
ఈ రాశివారు ఆగస్టు, సెప్టెంబర్ నెలలో అనేక శుభ ఫలితాలను అనుభవించే అవకాశం ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. మనసులోని కొన్ని కోరికలు, ఆశలు నెరవేరు తాయి. శుభ కార్యాలు, దైవ కార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు. తీర్థ యాత్రలు, విహార యాత్రలు బాగా పెరుగుతాయి. విదేశీ ప్రయాణాలకు కూడా అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలుపెళ్లికి దారి తీస్తాయి. కుటుంబంలో పెళ్లి, గృహ ప్రవేశాల వంటి శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది.
అక్టోబర్, నవంబర్ నెలల్లో గురువు కొద్ది కాలం పాటు తనకు ఉచ్ఛ స్థానమైన కర్కాటకరాశిలోకి ప్రవేశిస్తున్నందువల్ల ఈ రాశివారికి అనేక విధాలుగా ప్రాభవం పెరుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందడంతోపాటు, అందలాలు ఎక్కే అవకాశం ఉంది. ఒక ప్రముఖుడుగా గుర్తింపు పొందే సూచనలు కూడా ఉన్నాయి. ఈ రాశివారు సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం వల్ల జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది.