
TV9 Indian Tigers and Tigresses: ఆస్ట్రియాలోని గ్ముండెన్‌లో ఓవైపు వర్షం, మరోవైపు చలితో కఠినమైన సవాళ్లతో కూడిన పరిస్థితులను ఎదుర్కొన్న ఫుట్‌బాల్ ఛాంపియన్లు.. ఏమాత్రం వెనకడుగు వేయకుండా తమ ప్రాక్టీస్ పూర్తి చేశారు. టీవీ9 నెట్వర్క్ మొదలుపెట్టిన చారిత్రాత్మక ఫుట్‌బాల్ టాలెంట్ హంట్ ప్రోగ్రాం న్యూస్9 ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్లో ఎన్నికైన 28 మంది యువ ప్లేయర్లు తమ యూరోపియన్ కలలను సాకారం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.
దేశంలోని అగ్రశ్రేణి యువ ప్రతిభావంతుల కోసం దేశవ్యాప్తంగా జరిగిన ఈ టాలెంట్ హంట్ ప్రోగ్రాం ద్వారా భారత ఫుట్‌బాల్‌కు 28 మందిని ఎంపిక చేశారు. ఇందులో 12 మంది బాలికలు, 16 బాలురు ఉన్నారు. ఈ చారిత్రాత్మక ప్రోగ్రాం కోసం మొత్తం 50,000 రిజిస్ట్రేషన్లు వచ్చాయి. అందులో 10,000 మందిని షార్ట్‌లిస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా జరిగిన ప్రాంతీయ ట్రయల్స్‌లో పలు వడపోతల ద్వార 28 మంది మాత్రమే ఆస్ట్రియా పర్యటనకు ఎంపికయ్యారు. అంటే, తుది జాబితాలో చోటు దక్కించుకున్నారు.
సవాళ్లతో కూడిన ఆస్ట్రియా శిక్షణ శిబిరం..
ఇవి కూడా చదవండి
గ్ముండెన్‌లో జరిగిన శిక్షణా సెషన్లో రెండవ రోజున వర్షంతోపాటు చల్లని గాలులు ఈ యువ ప్లేయర్లకు స్వాగతమిచ్చాయి. కానీ, ఫుట్‌బాల్ ఛాంపియన్లు ఈ కఠిన సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని ట్రైనింగ్ సెషన్లలో చెమటోడ్చారు. యూరోపియన్ కోచ్‌ల ఆధ్వర్యంలో ఈ 28 మంది ప్లేయర్లు వేర్వేరు పాసింగ్ స్టేషన్లలో శిక్షణ పొందారు.
రెండు రోజుల కఠిన శిక్షణా సెషన్ల తర్వాత ఈ భారత సూపర్స్టార్లు బుధవారం, ఏప్రిల్ 2న మరో కీలక సెషన్లో పాల్గొననున్నారు. ఇదే వయసులోని యూరోపియన్ ఆటగాళ్లతో కూడిన జట్లతో తలపడనున్నారు. ఈ మ్యాచ్ టీవీ9 నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..