

తిరుమలను నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు లేఖ రాశారు టీటీడీ చైర్మన్ బీఆర్నాయుడు. తిరుమల కొండపై తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలు, హెలికాప్టర్లు, ఇతర వైమానిక కార్యాకలాపాలతో శ్రీవారి ఆలయం చుట్టూ ఉన్న పవిత్రమైన వాతావరణానికి భంగం కలుగుతోందని లేఖలో పేర్కొన్నారు.ఆగమశాస్త్ర నిబంధనలు, ఆలయ పవిత్రత, భద్రత సహా భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించడం ద్వారా తిరుమల పవిత్రత, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడడంలో మరో ముందడగు వేసినట్టవుతుందన్నారు టీటీడీ చైర్మన్ .
నిజానికి తిరుమల కొండపై హెలికాప్లర్లు, విమానాల రాకపోకలపై నిషేధాజ్ఞలున్నాయి.ఆగమశాస్త్రం ప్రకారం తిరుమల శ్రీవారి ఆలయం మీదుగా విమానాలు, హెలికాప్టర్లు వెళ్లకూడదు కానీ గత రెండు మూడేళ్లలో నిబంధనలకు విరుద్ధంగా కొండపై పలుసార్లు విమానాలు, హెలికాప్టర్లు చక్కర్లు కొట్టిన ఘటనలు కలకలంరేపాయి.కొందరు ఆకతాయిలు డ్రోన్లతో షూటింగ్ చేసిన సందర్భాలూ ఉన్నాయి. అలర్టయిన విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. ఏవియేషన్ శాఖకు ఫిర్యాదు చేశారు కూడా.
తిరుమలను నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించానలి టీటీడీ పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఆగమ శాస్త్ర నిబంధనలు, తిరుమల క్షేత్ర భద్రత, భక్తుల మనోభావాల దృష్ట్యా తిరుమలను నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించాలని ఇటీవల టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాసిన లేఖపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు సానుకూలంగా స్పందించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..