

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు గతంలో రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా (వీఐ) కాల్లు, ఎస్ఎంఎస్ల కోసం మాత్రమే ఫోన్‌ను ఉపయోగించే వారు అంటే ఇంటర్నెట్ డేటా అవసరం లేని వినియోగదారుల కోసం కొత్త వాయిస్, ఎస్ఎంఎస్ ప్లాన్లను ప్రవేశపెట్టాయి. అయితే ఈ ప్లాన్ల ధరలపై ట్రాయ్ ఆందోళన వ్యక్తం చేసింది. 2024 డిసెంబర్లో తక్కువ ధర స్పెషల్ టారిఫ్ వోచర్ (ఎస్టీవీ) ప్లాన్లు, వాయిస్, ఎస్ఎంఎస్ మాత్రమే ఎంపికలను అందించాలని టెలికాం ఆపరేటర్లను ట్రాయ్ ముందుగా ఆదేశించింది. దీంతో జియో, ఎయిర్టెల్, వీఐ కొత్త ప్లాన్లను రూపొందించాయి, అయితే ఈ ఆఫర్లు టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు ఆఫర్ చేస్తున్న వాటి ధరల కారణంగా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.
ట్రాయ్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో అధికారిక పోస్ట్ ద్వారా కొత్త ప్లాన్ల విషయంలో టెలికం ఈ ప్లాన్ల గురించి సవివరమైన సమాచారాన్ని ప్రారంభించిన 7 రోజుల్లో అందించాలని పేర్కొంది. ట్రాయ్ ఈ కొత్త వోచర్ ప్లాన్లలో ఏవైనా మార్పులు తప్పనిసరిగా దాని నియంత్రణ నిబంధనలకు అనుగుణంగా ఉండాలని స్పష్టం చేసింది. ట్రాయ్ మొదట్లో పెట్టిన పోస్ట్‌ను తర్వాత తీసివేసింది. అందువల్ల టెలికాం బ్రాండ్లు, డేటా లేకుండా వాటి ప్లాన్ల కోసం టెస్టింగ్ దశ ఎప్పుడు ప్రారంభం అవుతుందో? అనే విషయం స్పష్టం తెలియదని నిపుణులు చెబుతున్నారు.
రీచార్జ్ ప్లాన్స్ ఇలా
జియో ప్లాన్స్
- రూ. 458 ప్లాన్ : 84 రోజుల చెల్లుబాటు.
- రూ. 1958 ప్లాన్: 365 రోజుల చెల్లుబాటు.
ఎయిర్టెల్ ప్లాన్లు
- రూ. 499 ప్లాన్: 84 రోజుల చెల్లుబాటు.
- రూ. 1959 ప్లాన్: 365 రోజుల చెల్లుబాటు.
వోడాఫోన్ ఐడియా ప్లాన్
- రూ. 1460 ప్లాన్: 270 రోజుల చెల్లుబాటు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడక క్లిక్ చేయండి