

జక్కన్న డైరెక్షన్లో మహేష్ చేస్తున్న సినిమా ssmb29. ఎన్నో అంచనాల మధ్య, గప్ చుప్‌గా తెరకెక్కుతున్న ఈసినిమాలో మహేష్ ఎలా ఉంటాడనే క్యూరియాసిటీ అందర్లో ఉంది. అయితే ఈ క్యూరియాసిటీని తగ్గించేలా.. తాజాగా బాబు లుక్ బయటికి వచ్చింది. జిమ్ చేస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబుకు సంబంధించిన 14 సెకండ్ల వీడియో ఒకటి నెట్టింట లీకైంది. ఇక ఆ వీడియోలో రింగులు తిరిగిన భారీ జుట్టుతో.. అచ్చం సింహంలా మహేష్ కనిపించడం ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్లో.. ఫిల్మ్ లవర్స్ మధ్యలో హాట్ టాపిక్ అవుతోంది. ఈసినిమాపై ఎక్కడ లేని అంచనాలను పెంచేస్తోంది.