

మంచు మోహన్‌బాబు ఇంట్లోని వివాదాలకు ఏమాత్రం ఫుల్స్టాప్ పడడం లేదు. పెదరాయుడి కుటుంబంలో ఫైట్‌కు కాస్తా బ్రేక్ పడిందనుకునేలోపే.. మళ్లీ వైలెంట్ సీన్లు దర్శనమిస్తున్నాయి. ఫలితంగా మంచు ఫ్యామిలీలో దశలవారీ కాంట్రవర్శీలు క్రియేట్ అవుతూనే ఉన్నాయి. ఇప్పటికే.. ఆస్తుల పంపకాల విభేదాలతో మోహన్‌బాబు కుటుంబ వ్యవహారం రచ్చరచ్చ కాగా.. ఇప్పుడు కార్ల రగడ కాక పుట్టిస్తోంది. తన ఇంటిలోని కార్లను.. అన్న మంచు విష్ణు చోరీ చేశారంటూ మనోజ్ హైదరాబాద్ నార్సింగి పోలీసులను ఆశ్రయించడం హాట్‌టాపిక్‌గా మారుతోంది.
తాను ఇంట్లో లేనప్పుడు కారుతోపాటు కాస్ట్లీ వస్తువులను విష్ణు ఎత్తుకెళ్లారని నార్సింగి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు మంచు మనోజ్. జల్పల్లిలోని ఇంటిలోకి 150మంది వ్యక్తులు చొరబడి విలువైన వస్తువులను తీసుకెళ్లారని చెప్పుకొచ్చారు. తన ఇంట్లోని కార్లన్నీ.. విష్ణు ఆఫీసులో ఉన్నాయంటూ వాటికి సంబంధించిన ఆధారాలను పోలీసులకు అప్పగించారు. కొంతమంది గోడలు దూకి ఇంట్లోకి ప్రవేశించారని ఫిర్యాదులో తెలిపారు. కొన్ని వస్తువులను కూడా ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురు బర్త్ డే వేడుకల కోసం రాజస్థాన్‌కు వెళ్లగా.. విష్ణు ఇంట్లోకి ప్రవేశించి రచ్చ చేశారని మంచు మనోజ్ పోలీసుల ముందు వాపోయారు. తమ ఇంట్లో జరుగుతున్న పరిణామాలపై తండ్రి మోహన్‌బాబుతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నా అందుబాటులోకి రావడంలేదన్నారు. ఈ నేపథ్యంలోనే.. మంచు విష్ణుపై చర్యలు తీసుకోవాలని.. తనకు న్యాయం చేయాలని మంచు మనోజ్ నార్సింగి పోలీసులను వేడుకోవడం ఆసక్తిగా మారుతోంది.
వాస్తవానికి.. మంచు మోహన్‌బాబు కుటుంబంలో గతేడాది చివరి నుంచి వరుసగా విభేదాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇప్పటికే.. మోహన్‌బాబు, విష్ణుపై మంచు మనోజ్ పలుమార్లు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. మంచు ఫ్యామిలీలోని ఆస్తుల వివాదం పీక్ స్టేజ్‌కు చేరడంతో పోలీసులు సైతం సీరియస్ అయ్యారు. న్యూసెన్సులు క్రియేట్ చేయొద్దని రెండు వర్గాలకు వార్నింగ్‌లు కూడా ఇచ్చారు. అందరూ కూర్చుని ఇంటి సమస్యలు పరిష్కరించుకోవాలని మోహన్‌బాబు ఫ్యామిలీకి స్పష్టం చేశారు. ఈ క్రమంలో.. మంచు ఫ్యామిలీలో విభేదాలు కాస్త సర్దుకున్నాయనే లోపే తన అన్న విష్ణుపై మనోజ్ ఫిర్యాదు చేయడం చర్చనీయాంశం అవుతోంది. మొత్తంగా.. మనోజ్ ఫిర్యాదుతో మంచు ఫ్యామిలీలో మరోసారి వివాదాలు రచ్చ రేపుతున్నాయి. అయితే.. మనోజ్ ఆరోపణలపై విష్ణు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
ఇవి కూడా చదవండి :
Vaishnavi Chaitanya : నా ఫస్ట్ క్రష్ అతడే.. అబ్బాయిల్లో ఫస్ట్ గమనించేవి అవ్వే.. వైష్ణవి చైతన్య సెన్సేషనల్ కామెంట్స్
Parugu Movie: సినిమాలు వదిలేసి సూపర్ మార్కెట్ బిజినెస్‌లోకి.. పరుగు మూవీ హీరోయిన్ను ఇప్పుడే చూస్తే షాకే..
Pawan Kalyan- Mahesh Babu: పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్.. మహేష్ బాబు మూవీలో పవర్ ఫుల్ విలన్.. ఇంతకీ ఎవరీ బ్యూటీ..
OTT Movie: ఊహించని ట్విస్టులు.. దిమ్మతిరిగే క్లైమాక్స్.. అంజలి నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూశారా..?