
ఒకప్పుడు సినీరంగంలోని టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు. ఒక్కో సినిమాకు భారీగా పారితోషికం తీసుకుంది. అప్పట్లో ఆమెకు ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉండేది. అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. అందం, అభినయంతో కుర్రకారును కట్టిపడేసింది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సైతం ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఇదే విషయాన్ని నేరుగా ఆమె ఇంటికి వెళ్లి ఆమె తండ్రికి చెప్పగా.. అందుకు అతడు నిరాకరించారు. కొన్నాళ్లపాటు సినీ ఇండస్ట్రీని ఏలేసిన ఆమె.. ఇప్పుడు వ్యాపారరంగంలో సత్తా చాటుతుంది. రూ.4600 కోట్ల ఆస్తితో అత్యధిక ధనిక కథానాయికగా నిలిచింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ జూహీ చావ్లా. అప్పట్లో శ్రీదేవి రేంజ్ ఫాలోయింగ్ ఉండేది.
తెలుగులో జూహీ చావ్లా నటించి కేవలం 2 సినిమాల్లోనే. అక్కినేని నాగార్జునతో కలిసి విక్కీ దాదా అనే చిత్రంలో నటిస్తుంది. అప్పట్లో ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. 1984లో మిస్ ఇండియా కిరీటం గెలుచుకున్న జూహీ చావ్లా.. 1986లో ధర్మేంద్ర, సన్నీ డియోల్, శ్రీదేవి కలిసి నటించిన సుల్తానత్ సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత తెలుగు, హిందీ, మలయాళం భాషలలో ఆఫర్స్ అందుకుంది. అయితే కథానాయికగా స్టార్ డమ్ సంపాదించుకున్న జూహీ.. నెమ్మదిగా సహాయ పాత్రలలో నటించడం స్టార్ట్ చేసింది. హిందీలో అనేక చిత్రాల్లో నటించింది.
పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న జూహీ చావ్లా.. ఇప్పుడు వ్యాపారరంగంలో సత్తా చాటుతుంది. నివేదికల ప్రకారం ప్రస్తుతం ఆమె ఆస్తులు రూ.4600 కోట్లు. ఇండస్ట్రీలో షారుఖ్ ఖాన్ తర్వాత అత్యధిక ఆస్తులు ఉన్న నటిగా రికార్డ్ సృష్టించింది. గత 15 ఏళ్లుగా సినీరంగంలో నటించకపోయినా సంపద మాత్రం బాగానే పెరిగింది.
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..
ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..